Allu Arjun : బన్నీ లెక్క మారింది.. బోయపాటికి నో చెప్పింది అందుకేనంట..

‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్.. ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను సిినిమాకి బిగ్ రీజన్‌తో బ్రేక్ పడింది..

Allu Arjun : బన్నీ లెక్క మారింది.. బోయపాటికి నో చెప్పింది అందుకేనంట..

Bunny Boyapati

Allu Arjun: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన పక్కా మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ ‘సరైనోడు’.. ఈ సినిమా బన్నీ ఫ్యాన్స్, మాస్ ఆడియన్స్‌ని ఆకట్టుకుంది. అల్లు అర్జున్ కెరీర్‌లో ఈ రేంజ్ మాస్ సినిమా అంతకుముందు లేదు. మాంచి మాస్ మసాలా మూవీ ఇచ్చినందుకు బోయపాటితో బన్నీ మరో సినిమా చేస్తాడని గతంలో అన్నారు.

Allu Arjun: అల్లు అర్జున్ సింప్లిసిటీ.. రోడ్ పక్కన టిఫిన్ చేసిన ‘ఐకాన్ స్టార్’

కట్ చేస్తే.. ఇప్పుడా ప్రాజెక్ట్ పట్టాలెక్కడం లేదు.. ఎందుకంటే ప్రస్తుతం బన్నీ కెరీర్ ప్లానింగ్, లెక్కలు అన్నీ మారిపోయాయి.. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్‌తో మూడో సినిమా.. కెరీర్‌లో ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’ చేస్తున్నాడు. కథ ప్రకారం సినిమా రెండు భాగాలుగా రూపొందించబోతున్నట్లు తెలిపారు. అందుకు తగ్గట్లే ‘పుష్ప’ రాజ్ ఇంట్రో వీడియో, ‘దాక్కో దాక్కో మేక’ సాంగ్ రికార్డ్ స్థాయిలో వ్యూస్ రాబట్టి సినిమా మీద అంచనాలు పెంచేశాయి.

Pushpa The Rise Part – 01 : ‘పుష్ప రాజ్’ క్రిస్మస్‌కి వస్తాండాడబ్బా..

అయితే బోయపాటి తన స్టైల్లో చెప్పిన మాస్ కథ నచ్చినప్పటికీ బన్నీ రిజెక్ట్ చెయ్యడానికి రీజన్ ఏంటంటే.. బోయపాటిది రెగ్యులర్ రొటీన్ తెలుగు స్క్రిప్ట్ కానీ పాన్ ఇండియా సినిమా కాకపోవడమేనని తెలుస్తుంది. ఇప్పటివరకు తెలుగుతో పాటు మలయాళంలోనూ మార్కెట్ సంపాదించుకున్న బన్నీ ‘పుష్ప’ తర్వాత పాన్ ఇండియా స్క్రిప్టులనే సెలెక్ట్ చేసుకోవాలని చూస్తున్నాడట. అందుకే ‘ఐకాన్’ కథలోనూ ఆ విధంగా మార్పులు చెయ్యమని చెప్పారని సమాచారం.

Allu Arjun : క్రేజీ కాంబో.. విశ్వక్ సేన్ లవ్ స్టోరీలో బన్నీ..