Urvasivo Rakshasivo: ‘ఊర్వశివో రాక్షసివో’ ఓటీటీ పార్ట్‌నర్ లాక్.. ఒకటి కాదు రెండు!

యంగ్ హీరో అల్లు శిరీష్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఊర్వశివో రాక్షసివో’ నేడు ప్రపంచవ్యాప్తంగా మంచి బజ్ మధ్య రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా చిత్ర యూనిట్ తెరకెక్కించడంతో ఈ సినిమాను చూసేందుకు ఆడియెన్స్ ఆసక్తిని చూపిస్తున్నారు.

Urvasivo Rakshasivo: ‘ఊర్వశివో రాక్షసివో’ ఓటీటీ పార్ట్‌నర్ లాక్.. ఒకటి కాదు రెండు!

Allu Sirish Urvasivo Rakshasivo Locks Two OTT Partners

Urvasivo Rakshasivo: యంగ్ హీరో అల్లు శిరీష్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఊర్వశివో రాక్షసివో’ నేడు ప్రపంచవ్యాప్తంగా మంచి బజ్ మధ్య రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా చిత్ర యూనిట్ తెరకెక్కించడంతో ఈ సినిమాను చూసేందుకు ఆడియెన్స్ ఆసక్తిని చూపిస్తున్నారు. కాగా, ఈ సినిమాలో అందాల భామ అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఈ జోడీ మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా ఉందని సినిమా చూసినవారు అంటున్నారు.

Urvasivo Rakshasivo: సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న ‘ఊర్వశివో రాక్షసివో’ మూవీ!

ఇక ఈ సినిమాకు మంచి పాజిటివ్ టాక్ వస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రాబోయే రోజుల్లో ఎంతమేర విజయాన్ని అందుకుంటుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. కాగా, తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాకు సంబంధించిన డిజిటైల్ రైట్స్ ఇప్పటికే లాక్ కాగా, ఈ సినిమాను రెండు ఓటీటీ ప్లాట్‌ఫాంలలో స్ట్రీమింగ్ చేయనున్నారట.

Urvasivo Rakshasivo Trailer : ఇన్ని EMIలు ఉన్నోడు ఏ అమ్మాయి గురించి ఆలోచించకూడదు.. ఊర్వశివో రాక్షసివో ట్రైలర్ రిలీజ్..

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహాతో పాటు నెట్‌ఫ్లిక్స్ కూడా ఊర్వశివో రాక్షసివో చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయనున్నాయట. అయితే ఈ సినిమాను ఎప్పుడు స్ట్రీమింగ్ చేస్తారనే విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. రాకేష్ శశి తెరకెక్కించిన ఈ యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీని ధీరజ్ మొగిలినేని, విజయ్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేశారు.