Sohail: లక్కీ లక్ష్మణ్ ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి!

దత్తాత్రేయ మీడియా పతాకంపై బిగ్‌బాస్ ఫెమ్ సోహైల్, మోక్ష జంటగా ఎ.ఆర్ అభి దర్శకత్వంలో హరిత గోగినేని నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీ “లక్కీ లక్ష్మణ్” ఇప్పటికే.....

Sohail: లక్కీ లక్ష్మణ్ ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి!

Anil Ravipudi Launches Sohail Next Movie Lucky Lakshman First Look Poster

Sohail: దత్తాత్రేయ మీడియా పతాకంపై బిగ్‌బాస్ ఫెమ్ సోహైల్, మోక్ష జంటగా ఎ.ఆర్ అభి దర్శకత్వంలో హరిత గోగినేని నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీ “లక్కీ లక్ష్మణ్” ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ పోస్టర్ ను ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి విడుదల చేశారు. ఈ సందర్బంగా దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ‘‘లక్కీ లక్ష్మణ్” ఫస్ట్ లుక్ చాలా బాగుంది. దర్శక, నిర్మాతలకు ఇది మొదటి చిత్రమైనా చాలా చక్కగా తెరకెక్కించారు. వీరిద్దరికీ ఈ చిత్రం మంచి పేరు తీసుకురావాలి. నటుడు సోహైల్ నాకు బిగ్ బాస్ నుండి తెలుసు తన నటన బాగుంటుంది. వీరి ముగ్గురు కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.

ఇక చిత్ర హీరో సొహైల్ మాట్లాడుతూ… మా అనిల్ రావిపూడి అన్న ఎంతో బిజీగా ఉన్నా మా ‘‘లక్కీ లక్ష్మణ్” ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంఛ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఆయన ఈ సినిమా పోస్టర్ ను లాంచ్ చేయడంతో మా సినిమా బిగ్ సక్సెస్ అవుతుందని భావిస్తున్నాం. ఇక ఈ చిత్ర దర్శక, నిర్మాతలకు సినిమాపై ఎంత ప్యాషన్ ఉందో సినిమా కథలను సెలెక్ట్ చేసుకోవడంలో కూడా అంతే అభిరుచిని కలిగి ఉన్నారు. ఈ సినిమాకు టెక్నికల్ పరంగా, ఔట్ పుట్ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సీనియర్ టెక్నీషియన్స్ తో నిర్మించారు.ఈ చిత్రం అందరికీ తప్పకుండా నచ్చుతుంది అని అన్నారు.

చిత్ర దర్శకుడు అభి మాట్లాడుతూ.. నటీ, నటులు టెక్నిషియన్స్ అందరూ ఫుల్ సపోర్ట్ చేయడం జరిగింది. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకొన్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ లాంచ్ చేసుకునే వరకు రావడమే కాకుండా నా ఫెవరెట్ డైరెక్టర్ అయిన అనిల్ రావిపూడి గారి చేతుల మీదుగా మా ‘‘లక్కీ లక్ష్మణ్” ఫస్ట్ లుక్ విడుదల కావడం చాలా సంతోషంగా ఉంది. మా జనరేషన్ దర్శకులకు ఆయనే ఇన్స్పిరేషన్. అవుట్‌ అండ్‌ అవుట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన ఈ చిత్రం ప్రేక్షకులందరికీ కచ్చితంగా నచ్చుతుంది అని అన్నారు. మంచి డీఫ్రెంట్ సబ్జెక్టుతో వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులందరికీ కచ్చితంగా నచ్చుతుంది. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని విశేషాలతో మీ ముందుకు వస్తామని చిత్ర నిర్మాత అన్నారు.