Nutrients Food : వయస్సు అర్ధ సెంచరీ దాటిందా?…మీరు తినాల్సిన పోషకాహారాలు ఇవే!

శరీరానికి క్యాల్షియం, విటమిన్ డి చాలా అవసరం. కాబట్టి ఈ రెండు శరీరానికి అందేలా చూసుకోవాలి. క్యాల్షియం, విటమిన్ డి సమృద్ధిగా ఉండే బ్రొకోలి, ఆకుకూరలు, కొవ్వు శాతం తక్కువగా ఉండే పాలు, పెరుగు తీసుకోవాలి.

Nutrients Food : వయస్సు అర్ధ సెంచరీ దాటిందా?…మీరు తినాల్సిన పోషకాహారాలు ఇవే!

Food (1)

Nutrients Food : 50 ఏళ్ల వయస్సులోకి అడుగుపెట్టారంటే.. ఆరో్గ్యంపై జాగ్రత్త వహించాలి. తీసుకునే ఆహారంలో పోషక విలువలు, విటమిన్స్ సమృద్ధిగా ఉండే ఆహారాన్ని రోజువారీ డైట్ లో చేర్చుకుంటే.. మరో 50 ఏళ్లు ఆయురారోగ్యాలతో జీవితాన్ని గడిపేయెచ్చు. వయస్సు పైబడే కొద్దీ ఆరోగ్యం, ఆహారం విషయంలో శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. పెరుగుతున్న వయస్సుకు తగ్గట్టుగా శరీరానికి తగిన ఆహారం తీసుకోవటం మంచిది.

రోజువారీ ఆహారంలో పండ్లు తప్పనిసరిగా తీసుకోవడం మంచిది. సీజన్‌వారీగా అందుబాటులో ఉండే పండ్లు తీసుకుంటూ ఉండాలి. న్యూట్రీషియస్ ఫుడ్ గా పండ్లను చెప్పవచ్చు. తాజా పండ్లలో శరీరానికి కావలసిన పోషకాలు సమృద్ధిగా అందుతాయి.

50 ఏళ్లు దాటిన వారు తప్పని సరిగా తమ ఆమారంలో చేపలను బాగం చేసుకోవాలి. చేపలని వారానికి రెండుసార్లు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. సాల్మన్, ట్యూనా, హలిబుట్ వంటి చేపలతోపాటు సీ ఫుడ్స్ కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఇందులో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుస్తాయి.

వయస్సు పెరిగే వారికి జ్యూస్ లు తీసుకోవటం మంచిది. ఫ్రూట్ జ్యూస్ లు తరచుగా తీసుకోవడం వల్ల ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. అయితే జ్యూస్ లలో చక్కెర స్ధాయిలు అధికంగా ఉంటాయి కాబట్టి జ్యూస్ లలో చక్కెర వాడకపోవటమే ఉత్తమం. చక్కెర వాడితే మధుమేహం బారిన పడే అవకాశాలు ఉంటాయి.

శరీరానికి క్యాల్షియం, విటమిన్ డి చాలా అవసరం. కాబట్టి ఈ రెండు శరీరానికి అందేలా చూసుకోవాలి. క్యాల్షియం, విటమిన్ డి సమృద్ధిగా ఉండే బ్రొకోలి, ఆకుకూరలు, కొవ్వు శాతం తక్కువగా ఉండే పాలు, పెరుగు తీసుకోవాలి. ఎముకల పటుత్వం కోసం ఈ ఆహారాలను తీసుకోవటం ఉపయోగకరంగా ఉంటుంది.

తాజా కూరగాయలు తీసుకోవాలి. ఫ్రిజ్ లో ఉంచిన ఆహారం తీసుకోకుండా ఉండటం మంచిది. ఎప్పటికప్పుడు తాజా ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం వల్ల.. శరీరానికి ఫైబర్ అందుతుంది. వయస్సు 50 తరువాత బిపి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఉప్పు ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది. బీపీ పెరిగితే.. గుండె నొప్పి, కిడ్నీ సంబంధిత వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది. బ్రౌన్ రైస్ ఈ వయసులో తీసుకోవటం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.