Pregnant Woman: మంచులో అంబులెన్స్ రాలేని పరిస్థితి.. గర్భిణీని హాస్పిటల్‌కు చేర్చిన ఆర్మీ

వాతావరణంలో మార్పులు దారుణమైన పరిస్థితులు సృష్టిస్తున్నాయి. మామూలుగానే మంచుతో కప్పి ఉండే జమ్మూ కశ్మీర్ లో ప్రస్తుత చలికాలం రెట్టింపుగా కురుస్తుండటంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది.

Pregnant Woman: మంచులో అంబులెన్స్ రాలేని పరిస్థితి.. గర్భిణీని హాస్పిటల్‌కు చేర్చిన ఆర్మీ

Indian Army

Pregnant Woman: వాతావరణంలో మార్పులు దారుణమైన పరిస్థితులు సృష్టిస్తున్నాయి. మామూలుగానే మంచుతో కప్పి ఉండే జమ్మూ కశ్మీర్ లో ప్రస్తుత చలికాలం రెట్టింపుగా కురుస్తోన్న మంచు రాకపోకలకు ఇబ్బందిగా మారింది. అంతటి విషమ పరిస్థితుల్లో గర్భిణీకి నొప్పులు వస్తుండటంతో అత్యవసరంగా హాస్పిటల్ కు తరలించేందుకు ఆర్మీ కదిలొచ్చింది.

పారో గ్రామం నుంచి స్ట్రెచర్ మీద మోసుకెళ్తూ.. పబ్లిక్ హెల్త్ సెంటర్ అంబులెన్స్ వరకూ మోసుకొచ్చారు. ‘విషయం తెలియగానే ఆలస్యం చేయకుండా బ్యాటిల్‌ఫీల్డ్ నర్సింగ్ అసిస్టెంట్స్ (BFNA) సహకారంతో ఉదయం 11 గంటల సమయంలో ఘగ్గర్ హిల్ నుంచి పోర్టర్‌లతో పాటు సలాసన్ వైపుకు తీసుకొచ్చారు” అని ఆర్మీ తెలిపింది.

అలా దాదాపు 6.5కిలోమీటర్లు మధ్యాహ్నం ఒంటి గంట 45నిమిషాల సమాయానికి మోసుకొచ్చి పారామెడిక్స్ టీంకు అప్పగించారు. ఆర్మీ చేసిన పనికి కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.

ఇది కూడా చదవండి: ఫెమినిస్ట్ ఫాతిమా షేక్‌ను డూడుల్‌తో సత్కరించిన గూగుల్