Aryan Khan : అధికారులను ఆశ్చర్య పరిచిన షారుఖ్ కొడుకు మాటలు..

ఆదివారం ఆర్యన్ ఖాన్‌కు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కౌన్సెలింగ్ నిర్వహించగా.. అతని ప్రవర్తనలో, మాటల్లో చాలా మార్పు కనిపించిందని అధికారులు అంటున్నారు..

Aryan Khan : అధికారులను ఆశ్చర్య పరిచిన షారుఖ్ కొడుకు మాటలు..

Aryan Khan

Updated On : October 17, 2021 / 6:33 PM IST

Aryan Khan: కింగ్ ఖాన్, బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్టవడం హిందీతో పాటు ఇతర ఇండస్ట్రీల్లో సైతం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ముంబైలోని ఆర్థర్ రోడ్ జైల్లో రిమాండ్‌లో ఉన్నాడు ఆర్యన్. ఇప్పటికే రెండు సార్లు బెయిల్ తిరస్కరించింది కోర్టు.

Chiranjeevi : చిరంజీవి చేతికి గాయం

ఆదివారం ఆర్యన్ ఖాన్‌కు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కౌన్సెలింగ్ నిర్వహించింది. ఎన్సీబీ డైరెక్టర్ సమీర్ వాంఖెడె, ఆర్యన్‌తో మాట్లాడారు. కౌన్సెలింగ్ నిర్వహిస్తున్న సమయంలో ఆర్యన్‌ ప్రవర్తనలో, మాటల్లో చాలా మార్పు కనిపించిందని సమీర్ అంటున్నారు.

Akhil Akkineni : ‘టక్కరిదొంగ’ సెట్‌లో ‘సిసింద్రీ’

జైలు నుంచి రిలీజ్ అయిన తర్వత మంచి పనులు చేసి, మీరంతా గర్వపడేలా చేస్తానని.. పేదవారిని సామాజికంగా, ఆర్థికంగా ఆదుకునేందుకు పని చేస్తానని, అంతే కానీ ఇలాంటి ఇష్యూలతో పబ్లిసిటీ వచ్చే ఏ పనీ చెయ్యబోనని ఆర్యన్ చెప్పినట్లు ఓ అధికారి వెల్లడించారు. కాగా ఆర్యన్ ఖాన్ వేసిన బెయిల్ పిటిషన్‌పై ఈనెల 20న స్పెషల్ కోర్టు తీర్పు వెల్లడించనుంది.

Nora Fatehi : ‘బాహుబలి’ భామ హ్యాండ్ బ్యాగ్ కాస్ట్ ఎంతంటే!