Short Dress Problem : షార్ట్స్ వేసుకొని ఎగ్జామ్ రాయటానికి వీల్లేదన్న అధికారులు..ఆమె ఏం చేసిందంటే..

షార్ట్స్ వేసుకుని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయటానికి వచ్చిన అమ్మాయిని అడ్డుకున్నారు అధికారులు. ఎగ్జామ్ రాయటానికి వీల్లేదని బయటకు పంపించేశారు. దీంతో ఆమె ఓ కర్టెన్ చుట్టుకుని...

Short Dress Problem : షార్ట్స్ వేసుకొని ఎగ్జామ్ రాయటానికి వీల్లేదన్న అధికారులు..ఆమె ఏం చేసిందంటే..

Assam Girl Exam

assam girl wrapped in a curtain exam writeing : ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయాలంటే కొన్ని కండిషన్స్ తప్పకుండా పాటించాల్సిందే. ‘ఒక్క నిమిషం లేట్’ వంటివాటితో పాటు..మరికొన్ని తప్పనిసరి. కానీ వాటిలో డ్రెస్సింగ్ కూడా ముఖ్యమేననే ఓ సంఘటన జరిగింది అస్సాంలో. ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయటానికి ఓ అమ్మాయి షార్ట్స్ వేసుకుని వచ్చింది. దీంతో ఆమెను కాలేజీ అధికారులు అడ్డుకున్నారు. ఇటువంటి డ్రెస్ వేసుకుని వస్తే ఎగ్జామ్ రాయనివ్వం అని చెప్పారు. కానీ డ్రెస్ మార్చుకోవటానికి వీల్లేకుండాపోయింది. అంత సమయం కూడా లేదు.దీంతో ఆ అమ్మాయి ఏం చేసిందంటే..

అది అస్సాంలోని సోనిట్‌పూర్ జిల్లా తేజ్‌పూర్‌లో ఉన్న గిరిజానంద చౌద‌రి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ టెక్నాల‌జీ. అక్కడ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఈ పరీక్ష రాయటానికి జూబ్లీ తాములి అనే 19 ఏళ్ల అమ్మాయి వచ్చింది. పరీక్ష రాయటానికి ఆమె షార్ట్స్ వేసుకొని వ‌చ్చింది. మరి ఎగ్జామ్స్ రాయటానికి ఎలా రావాలి?అనే విషయం తెలియక అలా వచ్చిందో లేక మరి ఏ కారణాలతో అలా రావాల్సి వచ్చిందో గానీ..షార్ట్స్ వేసుకొని ఎగ్జామ్ రాయటానికి వచ్చింది. కానీ కాలేజీ అధికారులు మాత్రం అలా షార్ట్స్‌లో ప‌రీక్ష రాయ‌డం కుద‌ర‌దు అని తేల్చి చెప్పారు. దీంతో ఆమె చేసేది లేక అక్క‌డే ఉన్న ఓ ప‌ర‌దాను చుట్టుకొని ప‌రీక్ష రాయాల్సి వ‌చ్చింది.

Read more : AP EAPCET: విద్యార్థిని ఏడిపించిన ఒక్క నిమిషం, పరీక్షా కేంద్రంలోకి నో ఎంట్రీ

కాగా..బుధవారం (సెప్టెంబర్ 15,2021) అస్సాం అగ్రికల్చ‌ర్ యూనివ‌ర్సిటీ చౌద‌రి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ టెక్నాల‌జీ ఓ ఎంట్ర‌న్స్ ఎగ్జామ్ నిర్వ‌హించింది. జూబ్లీ త‌న తండ్రితో కలిసి ఈ ఎగ్జామ్ రాయ‌డానికి బిశ్వ‌నాథ్ చ‌రియాలీ నుంచి వ‌చ్చింది. అలా వచ్చిన ఆమె ఎగ్జామ్ సెంట‌ర్‌లోకి అడుగుపెడుతుండగా..ఎవ‌రూ ఎలాంటి అభ్యంత‌రం చెప్ప‌లేద‌ని, ప‌రీక్ష హాల్‌లోకి వెళ్లే స‌మ‌యంలో అంద‌రినీ లోపలికి పంపించి..తాను షార్ట్ డ్రెస్‌లో రాకూడ‌దంటూ త‌న‌ను అడ్డుకున్న‌ారని తెలిపింది.

కానీ ఇటువంటి ఎగ్జామ్ రాయటానికి వచ్చేవారికి డ్రెస్ కోడ్ గురించి ఎటువంటి నిబంధలు చెప్పలేదనీ..అడ్మిట్ కార్డ్‌లో ఎక్క‌డా అటువంటి నిబంధనలు లేవని అదే విషయాన్ని తాను ప్రశ్నిస్తే..ఎగ్జామ్ నిర్వాహకులు మేం ప్రత్యేకించి చెప్పాలా? ఆ విషయం నువ్వే తెలుసుకోవాలంటూ మాట్లాడారని తెలిపింది.కాగా షార్ట్స్ తో ఎగ్జామ్ హాల్లోకి వెళ్లవద్దని చెప్పిన అధికారులు జూబ్లీ తండ్రికి మార్కెట్ కు వెళ్లి ఓ ప్యాంట్ కొనుక్కురండి అని సూచించారు. దీంతో ఆయన వెంట‌నే మార్కెట్‌కు ప‌రుగెత్తాడు. కానీ అక్కడే ఉన్న ఇద్ద‌రు యువ‌తులు.. ఓ క‌ర్టెయిన్ చుట్టుకొని వ‌చ్చెయ్ అని చెప్ప‌డంతో ఆమె అలాగే హాల్‌లోకి వెళ్లి ప‌రీక్ష రాసింది.

Read more : TS Eamcet 2021 : విద్యార్థులకు అలర్ట్.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

దీనిపై జూబ్లీ ఆవేదన వ్యక్తంచేసింది. త‌న జీవితంలో ఇది అత్యంత అవ‌మాన‌క‌ర‌మైన అనుభ‌వం అని ప‌రీక్ష రాసి బయటకు వచ్చిన తరువాత చెప్పుకొచ్చింది.యువ‌తులు ఏ డ్రెస్ వేసుకోవాలి? ఏమి వేసుకోకూడదని అను కాలేజీ నిర్వాహకులు ఎలా చెబుతారు? అంటూ ప్ర‌శ్నించింది. షార్ట్ డ్రెస్ వేసుకోవ‌డం నేర‌మా? అదోక అడ్డంకా? అని ఆవేదనతో ప్రశ్నించింది.