Bairi Naresh Arrest: అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేశ్ అరెస్ట్..

Bairi Naresh Arrest: అయ్యప్పస్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఓయూ విద్యార్థి, నాస్తిక సంఘం అధ్యక్షుడు బైరి నరేశ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వరంగల్‌లోని ఓ హోటల్‌లో నరేశ్‌ ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి వెళ్లి అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

Bairi Naresh Arrest: అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేశ్ అరెస్ట్..

Bairi Naresh

Bairi Naresh Arrest: అయ్యప్పస్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఓయూ విద్యార్థి, నాస్తిక సంఘం అధ్యక్షుడు బైరి నరేశ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వరంగల్‌లోని ఓ హోటల్‌లో నరేశ్‌ ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి వెళ్లి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. నరేశ్‌ను వికారాబాద్ ఎస్పీ కార్యాలయంకు తరలిస్తున్నారు. ఇటీవల అయ్యప్ప స్వామిపై నరేశ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం విధితమే.

Bairi Naresh On Ayyappa : అగ్గి రాజేసిన బైరి నరేశ్ అనుచిత వ్యాఖ్యలు.. కఠినంగా శిక్షించాలని అయ్యప్ప భక్తుల డిమాండ్

నరేశ్ వ్యాఖ్యలపట్ల రాష్ట్ర వ్యాప్తంగా అయ్యప్ప స్వామి మాలదారులు భగ్గుమన్నారు. నరేశ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం నరేశ్ పై దాడిసైతం జరిగింది. ఇప్పటికే బైరి నరేశ్ పై 153ఏ, 295ఏ, 298, 505 సెక్షన్ల కింద కొడంగల్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. రెండు రోజులుగా పరారీలో ఉన్న నరేశ్ ను.. సోషల్ మీడియాలో ట్రేస్ చేసి పట్టుకున్నట్లు తెలిపారు.

పంజాగుట్ట పీఎస్‎లో భైరి నరేష్‎పై ఫిర్యాదు

నరేశ్ వ్యాఖ్యల పట్ల రాష్ట్ర వ్యాప్తంగా అయ్యప్ప మాలధారులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. శనివారం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో నిరసనలు చేపట్టాలని నిర్ణయించారు. నరేశ్ ను వెంటనే అరెస్టు చేయాలని లేకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని పోలీసులకు అయ్యప్ప స్వామి మాలధారులు డిమాండ్ చేశారు. తాజాగా నరేశ్ అరెస్టుతో.. అయ్యప్ప మాలధారులు తమ ఆందోళనలు విరమించాలని వికారాబాద్ ఎస్పీ కోమటిరెడ్డి కోరారు. నరేశ్ పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.