Veera Simha Reddy: వీరసింహారెడ్డిలో బాలయ్య ఊచకోత మామూలుగా ఉండదట!

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’ ఇప్పటికే రిలీజ్ డేట్‌ను లాక్ చేసుకుని ప్రేక్షకుల్లో అదిరిపోయే క్రేజ్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తుండగా, పూర్తి ఫ్యాక్షన్ నేపథ్యంలో ఈ సినిమా కథ రానున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, టీజర్, వీడియో గ్లింప్స్‌లు ఈ సినిమాపై నెలకొనన్నా అంచనాలను అమాంతం పెంచేశాయి.

Veera Simha Reddy: వీరసింహారెడ్డిలో బాలయ్య ఊచకోత మామూలుగా ఉండదట!

Balakrishna Character In Veera Simha Reddy Will Stun The Audiences

Veera Simha Reddy: నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’ ఇప్పటికే రిలీజ్ డేట్‌ను లాక్ చేసుకుని ప్రేక్షకుల్లో అదిరిపోయే క్రేజ్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తుండగా, పూర్తి ఫ్యాక్షన్ నేపథ్యంలో ఈ సినిమా కథ రానున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, టీజర్, వీడియో గ్లింప్స్‌లు ఈ సినిమాపై నెలకొనన్నా అంచనాలను అమాంతం పెంచేశాయి.

Veera Simha Reddy: వీరసింహారెడ్డి ఆగమనం ఆ రోజే..!

ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్నమైన లుక్స్‌లో కనిపిస్తుండటంతో ఈ సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందా అని అందరూ ఆతృతగా చూస్తున్నారు. కాగా, తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో బాలయ్య ఊచకోత నెక్ట్స్ లెవెల్‌లో ఉండబోతుందని తెలుస్తోంది. ఈ సినిమా ఫస్టాఫ్‌లో బాలయ్య నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తాడని.. ఈ క్రమంలో ఆయన చేసే అరాచకం మామూలుగా ఉండదని తెలుస్తోంది. ఇక సెకండాఫ్‌లో నెగెటివ్ నుండి పాజిటివ్‌గా బాలయ్య ఎలా మారుతాడనేది మనకు అద్భుతంగా చూపెట్టబోతున్నారట.

Veera Simha Reddy: వీరసింహారెడ్డి అప్పుడే ఓటీటీ పార్ట్‌నర్‌ను లాక్ చేశాడా..?

ప్రస్తుతం ఈ వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతుండటంతో, ఈ సినిమాలో బాలయ్య పర్ఫార్మెన్స్‌ను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. ఇక ఈ సినిమాలో అందాల భామ శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, కన్నడ నటుడు దునియా విజయ్ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.