NBK107: బర్త్‌డే ట్రీట్ రెడీ చేస్తున్న బాలయ్య..?

నందమూరి బాలకృష్ణ చాలాకాలం తరువాత ‘అఖండ’ సినిమాతో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుని తన అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చాడు. మాస్ చిత్రాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను...

NBK107: బర్త్‌డే ట్రీట్ రెడీ చేస్తున్న బాలయ్య..?

Balakrishna To Give Nbk107 As Birthday Treat

NBK107: నందమూరి బాలకృష్ణ చాలాకాలం తరువాత ‘అఖండ’ సినిమాతో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుని తన అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చాడు. మాస్ చిత్రాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రావడంతో ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు థియేటర్లకు క్యూ కట్టారు. ఫలితంగా అఖండ సినిమా బాలయ్య కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇక ఈ సినిమా తరువాత బాలయ్య తన నెక్ట్స్ మూవీని యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో తెరకెక్కిస్తున్నాడు.

NBK107: బాలయ్య కోసం భారీ ఇల్లు.. ఎక్కడో తెలుసా?

ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో బాలయ్య మరోసారి రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తాడని చిత్ర యూనిట్ అంటోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను అప్పుడే రెడీ చేస్తున్నారట చిత్ర యూనిట్. బాలయ్య పుట్టినరోజైన జూన్ 10న బాలయ్య 107వ సినిమాకు సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నట్లు సినీ వర్గాలు అంటున్నాయి. పవర్‌ప్యాక్డ్ టీజర్ కట్‌ను బాలయ్య అండ్ టీమ్ రెడీ చేస్తుందని తెలుస్తోంది.

NBK107: బాలయ్య ద్విపాత్రాభినయం.. మరోసారి తండ్రికొడుకులుగా?

అయితే బాలయ్య పుట్టినరోజుకు ఇంకా సమయం ఉండగా, అప్పుడే టీజర్ కట్ ఎందుకు చేస్తున్నారని పలువురు ప్రశ్నిస్తుంటే.. బాలయ్య బర్త్‌డే కానుకగా ఎలాంటి డిలే లేకుండా టీజర్‌ను ఇప్పుడే కట్ చేసి పెడితే బాగుంటుందని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుందట. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన అందాల భామ శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, కన్నడ నటుడు దునియా విజయ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి.