NBK107: బాలయ్య కోసం భారీ ఇల్లు.. ఎక్కడో తెలుసా?

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన 107వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో తెరకెక్కిస్తున్నాడు.....

NBK107: బాలయ్య కోసం భారీ ఇల్లు.. ఎక్కడో తెలుసా?

Huge House Set Erected For Nbk107

NBK107: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన 107వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో తెరకెక్కిస్తున్నాడు. ఇక పక్కా కమర్షియల్ అంశాలతో పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారు చిత్ర యూనిట్. కాగా ఇప్పటికే మొదలైన ఈ సినిమా షూటింగ్.. ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది.

NBK107: క్రేజీ అప్డేట్.. ఆచార్య సెట్ లో బాలకృష్ణ!

ఇక్కడ ఓ భారీ ఇంటి సెట్‌ను చిత్ర యూనిట్ ఏర్పాటు చేసింది. ఈ ఇంటి సెట్‌లో సినిమాలోని పలు కీలక సన్నివేశాలను చిత్ర యూనిట్ చిత్రీకరిస్తున్నారు. మరో విశేషం ఏమిటంటే.. ఈ ఇంటిలోనే హీరో బాలకృష్ణ ఎంట్రీ షాట్ కూడా ఉంటుందట. అయితే ప్రస్తుతం సినిమాలోని పలువురు నటీనటులపై కీలక సీన్స్ ఈ ఇంట్లో షూట్ చేస్తున్నారట. బాలయ్యకు సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన సీన్స్‌ను కూడా ఇంటి సెట్‌లో చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. బాలయ్య ఊరమాస్ అవతారంలో మనకు కనిపించనున్న ఈ సినిమాలో ఆయన రెండు విభిన్న పాత్రల్లో నటిస్తారని చిత్ర యూనిట్ అంటోంది.

NBK107: బాలయ్య ద్విపాత్రాభినయం.. మరోసారి తండ్రికొడుకులుగా?

కాగా ఈ సినిమాలో బాలయ్య సరసన అందాల భామ శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తుండగా వరలక్ష్మీ శరత్ కుమార్ ఓ ముఖ్య పాత్రలో నటిస్తోంది. కన్నడ నటుడు దునియా విజయ్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. కాగా ఈ సినిమాకు థమన్ అదిరిపోయే సంగీతం అందిస్తుండగా, సాయి బుర్రా మాధవ్ పవర్‌ఫుల్ డైలాగులు అందిస్తున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.