NBK107: క్రేజీ అప్డేట్.. ఆచార్య సెట్ లో బాలకృష్ణ!

మాస్ డైరెక్టర్ బోయపాటితో కలిసి హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ కొట్టిన నందమూరి నటసింహం బాలకృష్ణ ఇప్పుడు వరస సినిమాలను ఒకే చేస్తున్నారు.

NBK107: క్రేజీ అప్డేట్.. ఆచార్య సెట్ లో బాలకృష్ణ!

Nbk107

NBK107: మాస్ డైరెక్టర్ బోయపాటితో కలిసి హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ కొట్టిన నందమూరి నటసింహం బాలకృష్ణ ఇప్పుడు వరస సినిమాలను ఒకే చేస్తున్నారు. ముందుగా గోపీచంద్ మలినేనితో సినిమా మొదలు పెట్టిన బాలయ్య ప్రస్తుతం ముమ్మర షూటింగ్ లో ఉన్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తుండగా శృతి హాసన్ బాలయ్యకి జోడీగా నటిస్తుంది. అఖండ సినిమా సక్సెస్ కీలకమైన థమన్ ఈ సినిమాకి కూడా సంగీతాన్ని అందిస్తున్నాడు.

NBK107: బాలయ్య ఫస్ట్ లుక్.. స్టైలిస్ట్ మాసివ్ అవతార్!

బాలయ్య కెరీర్ లో ఇది 107వ సినిమా కాగా బాలయ్యను గోపీచంద్ ఎలా చూపించనున్నాడా అని అభిమానులలో ఆసక్తి నెలకొంది. అందుకు తగ్గట్లే ఈ మధ్యే విడుదల చేసిన పక్కా మాస్‌ లుక్‌లో బాలయ్య మెరుపులు మెరిపించాడు. ఈ సినిమా నుండి వచ్చిన ఫస్ట్ లుక్ కు అభిమానులు ఫిదా అయిపోగా తెలుగు సంవత్సరాది శుభదినాన ఈ సినిమా టైటిల్ ప్రకటించి అభిమానులకు సర్ ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది.

NBK107: బాలయ్య ద్విపాత్రాభినయం.. మరోసారి తండ్రికొడుకులుగా?

కాగా, ప్రస్తుతం ముమ్మర షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా హైదరాబాద్ కోకాపేట్ లో జరుగుతుంది. కోకాపేట్ లో మెగాస్టార్ చిరంజీవి ఆచార్య కోసం కొరటాల శివ ప్రత్యేకంగా సెట్ వేయించారు. ఆచార్య అక్కడ షూటింగ్ పూర్తవగా.. ప్రస్తుతం బాలయ్య-గోపీచంద్ మలినేని సినిమా అదే సెట్స్ లో షూటింగ్ జరుగుతుంది. కాగా, ఈ సినిమాకు వీర రాఘవ రెడ్డి అనే టైటిల్ అనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది.