Veera Simha Reddy: ‘వీరసింహారెడ్డి’లో ఇది మామూలు ట్విస్టు కాదుగా..?

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుండటంతో ప్రేక్షకులకు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అఖండ తరువాత బాలయ్య నటిస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని పూర్తి ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిస్తుండగా, ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, వీడియో గ్లింప్స్, సాంగ్స్ ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి.

Veera Simha Reddy: ‘వీరసింహారెడ్డి’లో ఇది మామూలు ట్విస్టు కాదుగా..?

Balakrishna Triple Role In Veera Simha Reddy News Goes Viral

Veera Simha Reddy: నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుండటంతో ప్రేక్షకులకు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అఖండ తరువాత బాలయ్య నటిస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని పూర్తి ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిస్తుండగా, ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, వీడియో గ్లింప్స్, సాంగ్స్ ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి.

Veera Simha Reddy : “మా బావ మనోభావాలు” అంటున్న బాలయ్య..

కాగా, ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్నమైన పాత్రల్లో నటించబోతున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపించింది. అయితే ఇప్పుడు ఈ సినిమాలో బాలయ్య డబుల్ కాదు, ట్రిపుల్ ధమాకా ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో బాలయ్య ఏకంగా మూడు గెటప్స్‌లో కనిపించబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో బాలయ్య చేసే యాక్షన్ నెక్ట్స్ లెవెల్‌లో ఉండబోతుందని చిత్ర యూనిట్ అంటోంది.

Veera Simha Reddy: వీరసింహారెడ్డి లాస్ట్ సాంగ్.. ఇక్కడే కానిస్తారట!

ఇప్పుడు ఈ వార్తతో అభిమానులు బాలయ్య ట్రిపుల్ రోల్ చేస్తున్నాడా అని ఆసక్తిగా ఈ సినిమావైపు చూస్తున్నారు. ఈ సినిమాలో అందాల భామ శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, థమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాను జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.