Bandi Sanjay: సీఎం కేసీఆర్ డైరెక్షన్ లో పోలీసుల సమక్షంలోనే మాపై దాడులు: బండి సంజయ్
బీజేపీ పేరు వింటేనే కేసీఆర్ కు, కేటీఆర్ కు భయం పట్టుకుందని.. అందుకే దాడుల పేరుతో బీజేపీని అడ్డుకుని రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టించాలనుకుంటున్నాడని బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు.

Bandi Sanjay: బీజేపీ నాయకులు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులన్నీ సీఎం కేసీఆర్ డైరెక్షన్ లో పోలీసుల సమక్షంలోనే జరుగుతున్నయని.. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో ఎంపీ నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను శనివారం ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రారంభించారు. అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో కరీంనగర్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు. ప్రజల అభివృద్ధి, వారి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తెలంగాణ బీజేపీ పనిచేస్తుందని.. ప్రజా సమస్యలను దారి మళ్లించేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని బండి సంజయ్ అన్నారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమేనన్న బండి సంజయ్.. ప్రజా సమస్యల పరిష్కారంలో రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు.
Also read: AP PRC Issue: ఏపీలో కొనసాగుతున్న ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల రిలే నిరాహార దీక్షలు
ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే బీజేపీ నేతలపై దాడులు చేయిస్తున్నారుని, అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నారని సీఎం కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో నల్గొండ, కరీంనగర్ లో తనపైనా, ఆర్మూర్ లో ఎంపీ అరవింద్ పై జరిగిన దాడులు సీఎం కుట్రలో భాగమే అంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో నాగేశ్వర్ రావు అనే బీజేపీ కార్యకర్తను పోలీసులు విచక్షణా రహితంగా కొట్టి.. హత్య చేసేందుకు కుట్ర చేశారని.. స్థానిక సీఐ బూతులు తిడుతూ బీజేపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించాడని బండి సంజయ్ ఆరోపించారు. రాష్ట్రంలో కొందరు పోలీసు అధికారులు సీఎంకు కొమ్ముకాస్తున్నరని ఆరోపించిన బండి సంజయ్.. ఇది మంచి పద్దతి కాదని హెచ్చరించారు.
Also read: Train Tracks Flames: అమెరికాలో రైలు పట్టాలపై చలిమంటలు, ఎందుకో తెలుసా?
బీజేపీ పేరు వింటేనే కేసీఆర్ కు, కేటీఆర్ కు భయం పట్టుకుందని.. అందుకే దాడుల పేరుతో బీజేపీని అడ్డుకుని రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టించాలనుకుంటున్నాడని బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అరాచకాలు, అక్రమాలు చేసి కోట్లు సంపాదించి ఆ సొమ్ముతో ఎన్నికల్లో ఓట్లను కొనుగోలు చేయాలనీ చూస్తున్నదంటూ బండి సంజయ్ విమర్శించారు. తెలంగాణలో బీజేపీ కార్యకర్తలు ఎంతో ఉత్సాహంతో పనిచేస్తున్నారని.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం తీవ్రంగా కృషిచేయాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు.
Also read: AP Employees Strike : ఏపీలో పీఆర్సీ వార్.. ఉద్యోగుల సమ్మెకు పెరుగుతున్న మద్దతు
- PM Modi Calls BandiSanjay : బండి సంజయ్‌కు ప్రధాని మోదీ ఫోన్.. శభాష్ అంటూ ప్రశంసల వర్షం
- Amit Shah On MinorityReservations : అధికారంలోకి వచ్చాక.. మైనారిటీ రిజర్వేషన్లు రద్దు-అమిత్ షా సంచలన ప్రకటన
- Amit Shah : అమిత్ షా పర్యటన వివరాలు..ఏ సమయంలో ఎక్కడ ఉంటారంటే..
- BJP Telangana: నేడు నగరానికి అమిత్ షా: బీజేపీ భారీ సభకు అన్ని ఏర్పాట్లు
- కేంద్రం విధానాలపై ప్రతిపక్ష రాష్ట్రాలన్నీ కలిసి పోరాడాలి
1IPL2022 Hyderabad Vs PBKS : ఓటమితో టోర్నీని ముగించిన హైదరాబాద్.. లాస్ట్ మ్యాచ్ పంజాబ్‌దే
2Telangana Covid Bulletin Report : తెలంగాణలో తగ్గిన కరోనా.. కొత్తగా ఎన్ని కేసులంటే
3IPL2022 Punjab Vs SRH : రాణించిన పంజాబ్ బౌలర్లు.. మోస్తరు స్కోరుకే హైదరాబాద్ పరిమితం
4Special Songs: క్యూ కడుతున్న స్టార్ హీరోయిన్స్.. స్పెషల్ సాంగ్‌కు ఓ లెక్కుంది!
5Tollywood Movies: టాలీవుడ్‌ను ఊరిస్తున్న ఊరమాస్.. ముందుంది అసలైన మాస్ జాతర
6Special Songs: స్టార్ డైరెక్టర్లే.. స్పెషల్ సాంగ్స్‌పై స్పెషల్ ఇంట్రెస్ట్!
7Srikakulam Crime: మురుగు కాలువ పైప్ గురించి గొడవ: శ్రీకాకుళంలో యువకుడిపై గునపంతో దాడి
8Helipad tour in Goa: ఆకాశంలో విహరిస్తూ గోవా బీచ్ అందాలు చూడొచ్చు: అందుబాటులోకి వచ్చిన హెలి టూరిజం
9Cars Collided: అంబులెన్సుకు దారి ఇస్తూ 7 కార్లు ఢీ
10Tomato : టొమాటోల్లోని సి విటమిన్ శరీరానికి అందాలంటే!
-
Watch Epic Video : పేపర్ రాకెట్‌తో గిన్నిస్ బుక్ రికార్డు బ్రేక్.. వీడియో వైరల్!
-
Vehicles in Goa: దేశంలోనే అధిక వాహనాలు ఉన్న రాష్ట్రం ‘గోవా’: ప్రమాదాలు, రద్దీ కూడా ఎక్కవ
-
Hot Water : అజీర్ణ సమస్యలు తొలగించే గోరువెచ్చని నీరు!
-
PM Modi : ఈనెల 23, 24న ప్రధాని మోదీ జపాన్ పర్యటన
-
Viral Video : హాలీవుడ్ సీన్ కాదు.. నిజంగానే భారీ మొసలి రోడ్డుపైకి వచ్చింది.. వీడియో..!
-
Pineapple : బరువు తగ్గించటంతోపాటు, బీపీని నియంత్రించే పైనాపిల్!
-
Jagityala : ఆడబిడ్డతో ఇంటికి వచ్చిన కోడలికి ఘనస్వాగతం పలికిన అత్త
-
India – China fight: చైనాకు చెక్ పెట్టేందుకు సిద్దమౌతున్న భారత్: నుబ్రా వ్యాలీ-డీబీఓ రోడ్డు పనులు వేగవంతం