ఎన్టీఆర్ జయంతి రోజు బాలయ్య ‘సింహ’ గర్జన..

ఎన్టీఆర్ జయంతి రోజు బాలయ్య ‘సింహ’ గర్జన..

BB 3: ‘‘ఎన్నాళ్లో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే’’.. అని ఆనందంతో పాట పాడుకుంటున్నారు బాలయ్య బాబు అభిమానులు.. నటసింహా నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలయికలో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ ఫిల్మ్.. BB3 వర్కింగ్ టైటిల్).. ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడింది.. కొద్ది నెలల విరామం తర్వాత ఇటీవలే షూటింగ్ పున:ప్రారంభమైంది.

గత మూడు రోజులుగా వరుస అప్‌డేట్స్‌తో టాలీవుడ్ కళకళలాడిపోయింది. మా బాలయ్య సినిమాకి సంబంధించి ఒక అప్‌డేట్ ఇవ్వండి అంటూ ఫ్యాన్స్ గోల గోల చేశారు. కట్ చేస్తే.. ఆదివారం మధ్యాహ్నం 3:36 గంటలకు BB3 అప్‌డేట్ ఇచ్చారు.

BB 3

స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతి నాడు మే 28న థియేటర్లలో నటసింహ గర్జన మొదలవుతోంది. పూర్ణ, ప్రగ్యా జైశ్వాల్ కథానాయికలు.. శ్రీకాంత్, సునీల్ శెట్టి విలన్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. బాలయ్య పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన BB 3 First Roar వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతమందిస్తున్నారు.