BSF అధికార పరిధి పెంపు నిర్ణయానికి వ్యతిరేకంగా బెంగాల్ అసెంబ్లీ తీర్మానం

ఇండో-బంగ్లా సరిహద్దు వెంబడి బీఎస్‌ఎఫ్ అధికార పరిధిని ప్రస్తుతమున్న 15 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల వరకూ విస్తరిస్తూ ఇటీవల కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయాన్ని

BSF అధికార పరిధి పెంపు నిర్ణయానికి వ్యతిరేకంగా బెంగాల్ అసెంబ్లీ తీర్మానం

Bsf (1)

BSF Jurisdiction:  ఇండో-బంగ్లా సరిహద్దు వెంబడి బీఎస్‌ఎఫ్ అధికార పరిధిని ప్రస్తుతమున్న 15 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల వరకూ విస్తరిస్తూ ఇటీవల కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. 112 ఓట్లతో తీర్మానం ఆమోదం పొందింది. తీర్మానానికి వ్యతిరేకంగా 63 ఓట్లు పడ్డాయి. తీర్మానంపై చర్చ సందర్భంగా..బీఎస్‌ఎఫ్ అధికార పరిధి పెంపును వెనక్కి తీసుకోవాలని కేంద్రప్రభుత్వాన్ని మంత్రి పార్థ ఛటర్జీ డిమాండ్‌ చేశారు.

అయితే ఈ తీర్మానంపై చర్చ సందర్భంగా టీఎంసీ నేత ఉదయన్ గుహ చేసిన వ్యాఖ్యలు సభలో కొద్దిసేపు సభ్యుల మధ్య వాగ్వాదానికి దారితీసింది. ”మహిళలు సరిహద్దును దాటుతున్నప్పుడు తనిఖీల పేరుతో బీఎస్ఎఫ్ సిబ్బంది దూకుడుగా వ్యవహరిస్తున్నారు. పిల్లల కళ్ల ముందే వారి ప్రైవేట్ పార్ట్‌లను టచ్ చేస్తున్నారు. అలాంటి పిల్లల నుంచి భారత్‌మాతా కీ జై అనో, వాళ్లు దేశభక్తులుగా ఉండాలనో ఎలా కోరుకుంటారు?” అని ఉదయన్ గుహ ప్రశ్నించారు.

ఈ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా బీజేపీ నేత మిహిర్ గోస్వామి, మరికొందరు ఆ పార్టీ నేతలు విరుచుకుపడుతూ పోడియం వైపు దూసుకువెళ్లి నినాదాలు చేశారు. దీనికి గుహ స్పందిస్తూ..”మీ కాలు ఒకటి ఇప్పటికే విరగ్గొట్టారు. రెండో కాలును కూడా విరగ్గొడతారు”అని వ్యాఖ్యానించారు. దీంతో సభ మరింత వేడెక్కింది. దీంతో కలగజేసుకున్న స్పీకర్ బిమన్ బెనర్జీ.. ఇలా మాట్లాడటం తగదని గుహను వారించారు. కాగా, ఈ తీర్మానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, రాష్ట్ర పోలీసులు, బీఎస్ఎఫ్‌ మధ్య వివాదాల ప్రశ్నే లేదని బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సువేందు అధికారి అన్నారు.

పశ్చిమ బెంగాల్‌లోని బంగ్లాదేశ్‌తో అంతర్జాతీయ సరిహద్దులో జరుగుతున్న నేర కార్యకలాపాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ..ఈ ఏడాది అక్టోబర్‌లో అసోం, పంజాబ్‌, పశ్చిమ బెంగాల్‌లో అంతర్జాతీయ సరిహద్దు నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న అధికార పరిధిని 50 కిలోమీటర్లకు పెంచింది. దీంతో భద్రతా బలగాలకు అరెస్టులు, సోదాలు, స్వాధీనం చేసుకునేందుకు అధికారం ఇస్తూ బీఎస్‌ఎఫ్‌ చట్టాన్ని సవరించింది. అయితే ఈ నిర్ణయాన్ని మమత వ్యతిరేకించారు. దీనిపై గతంలో మమత కేంద్రానికి సైతం లేఖ రాశారు.

ALSO READ Gold Smuggling : దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి లైఫ్ జాకెట్ లో రూ. కోటి విలువైన బంగారం