Booster Dose : బూస్టర్ డోస్ గా ఇంట్రానాసల్ కోవిడ్ వ్యాక్సిన్..!

కోవాక్సిన్, కోవిషీల్డ్ టీకాలు తీసుకున్నవ్యక్తులకు బుస్టార్ డోస్ గా ఇంట్రానాసల్ కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ఇది ఒమిక్రాన్‌ నుంచి రక్షణ అందిస్తుందని పలు నివేదికలు సూచిస్తున్నాయి.

Booster Dose : బూస్టర్ డోస్ గా ఇంట్రానాసల్ కోవిడ్ వ్యాక్సిన్..!

Booster Dose

intranasal COVID-19 vaccine : బూస్టర్ డోస్ కోసం ఇంట్రానాసల్ కోవిడ్ వ్యాక్సిన్ కు ముమ్మర ప్రయత్నాలు సాగుతున్నాయి. మూడవ దశ క్లినికల్ ట్రయల్ డేటాను భారత్ బయో టెక్ డీసీజిఐకి అందజేసింది. కోవాక్సిన్, కోవిషీల్డ్ టీకాలు తీసుకున్న వ్యక్తులకు బుస్టార్ డోస్ గా ఇంట్రానాసల్ కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వనున్నారు.

ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. భారత్ లో కూడా గుబులు పుట్టిస్తోంది. దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. వచ్చే ఏడాది జనవరిలో థర్డ్‌ వేవ్‌ ప్రారంభమై.. ఫిబ్రవరి వరకు భారీగా కేసులు పెరుగుతాయని నిపుణులు అంచనా వేయగా సర్వత్రా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ నుంచి నాసల్‌ వ్యాక్సిన్‌ రక్షణ అందిస్తాయని పలు నివేదికలు సూచిస్తున్నాయి.

Corona Vaccine : వ్యాక్సిన్ వేయించుకోనంటూ తలుపులు బిగించుకొని ఇంట్లో కూర్చున్న వ్యక్తి

కరోనా కొత్త వేరియంట్ల నుంచి రక్షణ కల్పించేందుకు ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్లలో కొన్ని మార్పులు చేయొచ్చని ఢిల్లీకి చెందిన ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌ (AIIMS) డైరెక్టర్‌ డాక్టర్‌ రణదీప్‌ గులేరియా తెలిపారు. ఒమిక్రాన్‌ ముప్పు నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఉన్న వ్యాక్సిన్లు ప్రభావవంతంగా ఉన్నాయని వెల్లడించారు. కొత్త వేరియంట్ల విషయంలో రోగనిరోధక శక్తి తగ్గుతుందన్నారు. సార్స్‌-కోవ్‌-2 వంటి అనేక వైరస్‌లు సాధారణంగా శ్లేష్మం ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఈ నేపథ్యంలో ముక్కు నుంచి వ్యక్తికి వ్యాక్సిన్‌ ఇవ్వడం ద్వారా వైరస్‌ శరీరంలోకి ప్రవేశించే ముందే నిర్మూలించవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. నాసికా వ్యాక్సిన్‌ ఇమ్యునోగ్లోబులిన్‌ A (IgA)ను ఉత్పత్తి చేస్తుందని, ఇది వైరస్ ప్రవేశించిన ముక్కులోనే బలమైన యాంటీబాడీలను ఉత్పత్తి చేయడం ద్వారా వైరస్‌ను నిరోధించగలదని అంటున్నారు. వైరస్‌తో పోరాడటానికి సహాయపడడంతోపాటు వైరస్‌ వ్యాప్తిని నిరోధిస్తుందని అంటున్నారు. నాసల్‌ టీకాలు బలమైన, సమర్థవంతమైన శ్లేష్మ రోగనిరోధక యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తాయని చెబుతున్నారు.

Aishwarya Rai : పనామా పేపర్స్ కేసు.. ఈడీ ముందు హాజరైన బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్​

దేశంలో ఇప్పటికే 161 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యమంత్రి మన్సుఖ్ మాండవీయ రాజ్యసభలో ప్రకటించారు. దేశంలో 161 ఒమిక్రాన్ కేసులు ఉన్నాయని..ఇప్పటి వరకు దేశంలో 137 కోట్ల మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేశామని పేర్కొన్నారు. థర్డ్ వేవ్ పొంచి ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు కాబట్టి ప్రజలంతా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఏమాత్రం కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించవద్దని సూచించారు.

కోవిడ్ థర్డ్ వేవ్ ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నామని చెప్పారు. మెడిసిన్లు అందుబాటులో ఉన్నాయినీ..దేశంలో కోవిడ్ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే ఒమిక్రాన్ కట్టడికి అన్ని ముందస్తు జాగ్రత్తలు చేపట్టినట్లు వెల్లడించారు. త్వరలో చిన్నారులకు వ్యాక్సిన్ అందజేస్తామన్నారు.