VJ Sunny : హరీష్ శంకర్ కథలో హీరోగా బిగ్‌బాస్ సన్నీ, హీరోయిన్‌గా దివి

బిగ్‌బాస్ సన్నీ హీరోగా, గతంలో బిగ్‌బాస్ లో పాల్గొన్న దివి హీరోయిన్ గా ఓ వెబ్ సిరీస్ మొదలైంది. స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ వెబ్ సిరీస్ కి కథ అందించగా........

VJ Sunny : హరీష్ శంకర్ కథలో హీరోగా బిగ్‌బాస్ సన్నీ, హీరోయిన్‌గా దివి

Divi

VJ Sunny :  సీరియల్ ఆర్టిస్ట్ గా, యాంకర్ గా పేరు తెచ్చుకున్న వీజే సన్నీ గత సీజన్ బిగ్‌బాస్ లో పాల్గొని విన్నర్ గా నిలిచాడు. దీంతో సన్నీకి అభిమానులు పెరిగి రేంజ్ కూడా పెరిగింది. ప్రస్తుతం సన్నీ హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు. తాజాగా బిగ్‌బాస్ సన్నీ హీరోగా, గతంలో బిగ్‌బాస్ లో పాల్గొన్న దివి హీరోయిన్ గా ఓ వెబ్ సిరీస్ మొదలైంది. స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ వెబ్ సిరీస్ కి కథ అందించగా కొత్త డైరెక్టర్ చంద్ర మోహన్ ఈ సిరీస్ నితెరకెక్కిస్తున్నారు.

Prashanth Neel : కేజిఎఫ్ సినిమాలో అందరికి గడ్డాలు ఎందుకు ఉన్నాయో తెలుసా ??

అగ్ర నిర్మాత దిల్ రాజు బ్యానర్ లో హరీశ్ శంకర్ సంయుక్త నిర్మాణంలో ఈ సిరీస్ తెరకెక్కనుంది. దొంగతనం నేపథ్యంలో థ్రిల్లర్ అంశాలతో ఉండనున్న ఈ సిరీస్ కి “ఏటీఎమ్” అనే టైటిల్ ని ఖరారు చేశారు. జీ5లో ఈ సిరీస్ విడుదల అవ్వనుంది. ఇందులో బిగ్‌బాస్ సన్నీ, దివి హీరో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. తాజాగా ఈ వెబ్ సిరీస్ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. త్వరలోనే ఈ సిరీస్ రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనుంది. దిల్ రాజు, హరీష్ శంకర్ లాంటి వారు నిర్మిస్తున్న ప్రాజెక్టులో సన్నీ, దివి భాగమవడంతో వారి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సిరీస్ తర్వాత సన్నీ ఫేట్ ఏ రేంజ్ లో మారనుందో చూడాలి.