VJ Sunny : ఆ మూడు రోజులు మమ్మల్ని వదిలేయండి.. సినిమా రివ్యూలు రాసే వాళ్ళకి బిగ్‌బాస్ VJ సన్నీ రిక్వెస్ట్..

బిగ్‌బాస్ అనంతరం హీరోగా సినిమాలు చేస్తున్నాడు VJ సన్నీ. ఇటీవలే కొన్ని రోజుల క్రితం అన్‌స్టాపబుల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి నవ్వించాడు. తాజాగా బిగ్‌బాస్ ఫేమ్ VJ సన్నీ సినిమా రివ్యూలు రాసేవాళ్ళకి ఒక రిక్వెస్ట్ తెలిపాడు.

VJ Sunny : ఆ మూడు రోజులు మమ్మల్ని వదిలేయండి.. సినిమా రివ్యూలు రాసే వాళ్ళకి బిగ్‌బాస్ VJ సన్నీ రిక్వెస్ట్..

BiggBoss VJ Sunny comments on Movie Reviewers

BiggBoss VJ Sunny : యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టిన సన్నీ అనంతరం పలు సీరియల్స్ లో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. బిగ్‌బాస్ లో పాల్గొని టైటిల్ గెలిచి ఒక్కసారిగా పాపులర్ అయ్యాడు. బిగ్‌బాస్ అనంతరం హీరోగా సినిమాలు చేస్తున్నాడు VJ సన్నీ. ఇటీవలే కొన్ని రోజుల క్రితం అన్‌స్టాపబుల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి నవ్వించాడు. తాజాగా బిగ్‌బాస్ ఫేమ్ VJ సన్నీ సినిమా రివ్యూలు రాసేవాళ్ళకి ఒక రిక్వెస్ట్ తెలిపాడు.

అభినవ్ సర్దార్ నటించిన మిస్టేక్ సినిమా ట్రైలర్ లాంచ్ ఆదివారం నాడు జరగగా హీరో శ్రీకాంత్ గెస్ట్ గా వచ్చారు. ఇదే ఈవెంట్ కి VJ సన్నీ కూడా వచ్చారు. ఈ ఈవెంట్ లో మాట్లాడుతూ తన అసలు పేరుని రివీల్ చేశాడు. VJ సన్నీ మాట్లాడుతూ.. ఈ సినిమా డైరెక్టర్ పేరు కూడా సన్నీనే. నా అసలు పేరు అరుణ్. నాకు నేను VJ సన్నీ అని పెట్టుకున్నాను. అందరికి అలాగే తెలుసు. ఇక నుంచి నా నేమ్ మార్చుకుంటున్నాను. అరుణ్ అనే అందరి ముందుకి వెళ్తా. నా నెక్స్ట్ సినిమా నుంచి కూడా అరుణ్ అనే టైటిల్ వేసుకుంటాను అని అన్నాడు.

Kamal Haasan : 28 ఏళ్ళ తర్వాత కమల్ డైరెక్ట్ తెలుగు సినిమా.. ప్రాజెక్ట్ K సినిమాపై స్పెషల్ లెటర్ రాసిన లోకనాయకుడు..

అలాగే చిన్న సినిమాల గురించి మాట్లాడుతూ.. సినిమాలకు రివ్యూలు రాసేవాళ్ళందరికి ఒక రిక్వెస్ట్. సినిమాలకు కేవలం మూడు రోజులే ఉంటుంది. ఆ మూడు రోజులే సినిమాకు ముఖ్యం. చిన్న సినిమాలకు మరింత ముఖ్యం. శుక్రవారం, శనివారం, ఆదివారం. ఈ మూడు రోజులు సినిమాని వదిలేయండి. నాలుగో రోజు నుంచి మీ ఇష్టం. మీరు సినిమాకు ఎలా రివ్యూ ఇచ్చినా పర్లేదు మీకు నచ్చినట్టు ఇవ్వండి, ఒక్కొక్కరిది ఒక్కో టేస్ట్ కానీ ఆ మూడు రోజులు మాత్రం వదిలేయండి. ఆ తర్వాత మీ రివ్యూలు ఇవ్వండి అని అన్నాడు. దీంతో సన్నీ చేసినా వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.