Gautam Gambhir: నుపుర్ శర్మకు సపోర్ట్‌గా నిలిచిన గౌతం గంభీర్

మహమ్మద్ ప్రవక్త, ముస్లిం కమ్యూనిటీకి వ్యతిరేకంగా చేసిన కామెంట్లకు సస్పెండ్ అయిన నుపుర్ శర్మకు సపోర్టింగ్ గా నిలిచారు గౌతం గంభీర్. ఇప్పటికే సపోర్టింగ్‌గా నిలిచిన చాలా మందితో పాటు గంభీర్ కూడా భాగమయ్యారు.

Gautam Gambhir: నుపుర్ శర్మకు సపోర్ట్‌గా నిలిచిన గౌతం గంభీర్

Gautham Gambhir

Gautam Gambhir: మహమ్మద్ ప్రవక్త, ముస్లిం కమ్యూనిటీకి వ్యతిరేకంగా చేసిన కామెంట్లకు సస్పెండ్ అయిన నుపుర్ శర్మకు సపోర్టింగ్ గా నిలిచారు గౌతం గంభీర్. ఇప్పటికే సపోర్టింగ్‌గా నిలిచిన చాలా మందితో పాటు గంభీర్ కూడా భాగమయ్యారు.

ఈ మేరకు ట్వీట్ చేసిన గంభీర్, “క్షమాపణలు చెప్పిన మహిళపై దేశవ్యాప్తంగా ద్వేషం, చావు బెదిరింపులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ‘సెక్యులర్ ఉదారవాదులు’ అని పిలవబడే వారి మౌనం ఖచ్చితంగా చెవిటిదే” అని గంభీర్ ట్వీట్ చేశాడు.

“నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలను ఎవరూ సమర్ధించలేదు. పార్టీ ఆమెపై కఠినమైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ఆమె నిస్సందేహంగా క్షమాపణలు తెలియజేసింది” అని పేర్కొన్నారు. ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలతో పాటు అనేక రాష్ట్రాల్లో జరుగుతున్న నిరసనలను కూడా ప్రస్తావించాడు.

Read Also : గౌతం గంభీర్‌ను చంపుతామంటూ బెదిరింపులు

“ఆమెతో పాటు ఆమె కుటుంబానికి వ్యతిరేకంగా ద్వేషం, హత్య బెదిరింపులతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో అల్లర్లు ఆందోళన కూడా సృష్టిస్తున్నారు. అసహనం అని పిలిచే మా పార్టీని నిందించే లౌకిక ఉదారవాదుల మౌనం మరింత ఆశ్చర్యకరమైనది. పరిస్థితిని నియంత్రించడానికి, అలాంటి ప్రవర్తనను నిరుత్సాహపరిచేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న చర్యలను అభినందిస్తున్నా. 21వ శతాబ్దంలోనూ భారతదేశంలో ఇలాంటి ప్రవర్తనను సహించదగినది కాదు” అని గంభీర్ పేర్కొన్నాడు.