MLA Raja singh-CM KCR : సీఎం కేసీఆర్ సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది : ఎమ్మెల్యే రాజాసింగ్

సీఎం సీఎం కేసీఆర్‌ సినిమా ఫ్లాప్ అయిందని ఎద్దేవా చేశారు. ప్రజలను వంచించటంలో కేసీఆర్‌ను మించిన వాళ్లు లేరని విమర్శించారు.

MLA Raja singh-CM KCR : సీఎం కేసీఆర్ సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది : ఎమ్మెల్యే రాజాసింగ్

Mla Raja Singh.cm Kcr

BJP MLA Raja singh ounter to CM kcr : వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంతో సమరానికి సై అంటూ టీఆర్‌ఎస్‌ ఇందిరాపార్క్ వద్ద చేపట్టింది. ఈ ధర్నాలో పాల్గొన్న సీఎం కేసీఆర్‌ బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. పలు విమర్శలు చేశారు. కేసీఆర్ చేసిన విమర్శలకు తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కౌంటరిచ్చారు. సీఎం సీఎం కేసీఆర్‌ సినిమా ఫ్లాప్ అయిందని ఎద్దేవా చేశారు. ప్రజలను వంచించటంలో కేసీఆర్‌ను మించిన వాళ్లు లేరని విమర్శించారు. ధర్నాచౌక్ వద్దని అన్న సీఎం కేసీఆర్ ఆ ధర్నా చౌక్ వద్దే ధర్నా చేపట్టి దర్నా చౌక్ వద్దే యూటర్న్ తీసుకున్నారనీ..దేశంలోనే సీఎం కేసీఆర్ ఓ విఫల సీఎంగా మిగిలిపోయారని..

Read more : Paddy Procurement : కేంద్రంపై సీఎం కేసీఆర్ ఫైర్, దేశం కోసం పోరాడుతాం

ప్రజలను వంచించటంలో కేసీఆర్ ను మించిన వాళ్ళు లేరని విమర్శించారు. హుజురాబాద్ ఓటమితో సీఎం కేసీఆర్ గ్రాఫ్ పడిపోయిందనీ..కవర్ చేసుకోవటానికి కేసీఆర్ నానా తంటాలు పడుతున్నారని ఎద్దేవా చేశారు. వ్యక్తిగత పనుల మీద ఢిల్లీ వెళ్ళే కేసీఆర్.. రైతు సమస్యలమీద ఎందుకు వెళ్లరు? అని ప్రశ్నించారు. రైతు చట్టాలు బాగున్నాయని గతంలో కేసీఆర్ ఇప్పుడు యూ టర్న్ తీసుకున్నారనీ..తెలంగాణలో బీజేపీ బలపడుతుండటంతో కేసీఆర్ కు భయం పట్టుకుందన్నారు. అందుకే ధర్నాలు అంటూ హడావిడి చేసిన ప్రజల దృష్టి మరల్చటానికి నానా తంటాలు పడుతున్నారన్నారు.

Read more : CM Kcr Warning : వడ్లను తీసుకోవాల్సిందే..లేకపోతే బీజేపీ ఆఫీసుపై కుమ్మరిస్తాం – సీఎం కేసీఆర్ హెచ్చరిక

అగ్రిమెంట్ ప్రకారం ధాన్యం కొనుగోలుకు ఎఫ్సీఐ సిద్ధంగా ఉందనీ..సీఎం కేసీఆర్ ప్రభుత్వం దివాలా తీసినందుకే సీఎం జిమిక్కులు చేస్తు నెపం బీజేపీపై తోసేందుకు యత్నిస్తున్నారని అన్నారు. దర్నా చౌక్ వద్దని కేసీఆర్ యూటర్న్ తీసుకున్నాడని దుయ్యబట్టారు. హుజురాబాద్ ఓటమితో గ్రాఫ్ పడిపోవటంతో కేసీఆర్ కవర్ చేసుకునే పనిలో ఉన్నాడని ఎద్దేవాచేశారు. రైతు చట్టాలు బాగున్నాయని గతంలో కేసీఆర్ అన్నారని గుర్తుచేశారు. ఇప్పుడు యూ టర్న్ తీసుకున్నాడని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం దివాలా తీసినందుకే కేసీఆర్ జిమిక్కులు చేస్తున్నారని రాజాసింగ్ చెప్పారు.