kalvakuntla Kavitha : కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుపై కీలక ప్రకటన చేసిన కల్వకుంట్ల కవిత..

kalvakuntla Kavitha : జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు స్పష్టం చేశారు.

kalvakuntla Kavitha : కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుపై కీలక ప్రకటన చేసిన కల్వకుంట్ల కవిత..

kalvakuntla Kavitha

Updated On : January 5, 2026 / 1:51 PM IST

kalvakuntla Kavitha : జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు స్పష్టం చేశారు. తెలంగాణ జాగృతి రాజకీయ పార్టీగా మారుతుందని అన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత, మైనార్టీ సోదరులు, ఆడపడుచులందరూ తనకు శక్తిని, ధైర్యాన్ని ఇస్తూ.. తనవైపు నిలబడి బలాన్ని ఇవ్వాలని కవిత అభ్యర్థించారు. రాబోయే కాలంలో గొప్ప రాజకీయ పార్టీగా ఎదుగుతామని కవిత విశ్వాసం వ్యక్తం చేశారు. విద్యార్థులు, నిరుద్యోగులు, అన్నివర్గాల కోసం పనిచేస్తా.. అవమానభారంతో పుట్టింటి నుంచి అన్ని బంధనాలు తెంచుకుని మీకోసం వస్తున్నా.. ఆశీర్వదించండి అని కవిత కోరారు.

Also Read : kalvakuntla Kavitha : నన్ను ఘోరంగా అవమానించారు.. శాసనమండలిలో కంటతడి పెట్టిన కవిత

తెలంగాణ ఉద్యమకారులను కవిత కీలక సూచన చేశారు. ఉద్యమకారులకు నేను మొదటిరోజే రిక్వెస్ట్ చేశా.. మళ్లీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా.. తెలంగాణ ఉద్యమకారుల హక్కుకోసం, ఉద్యమకారుల ఆత్మగౌరవం కోసం.. కచ్చితంగా పోరాటం చేయాల్సినటువంటి పార్టీల అవసరం తెలంగాణలో ఉంది. రాబోయే రోజుల్లో తెలంగాణ జాగృతి ఆ అవసరాన్ని పూరిస్తుందని కవిత చెప్పారు. ఉద్యమ కారులను, అమరవీరుల కుటుంబాలను తెలంగాణ జాగృతిలోకి నేను ఆహ్వానిస్తున్నానని కవిత తెలిపారు.