కాంగ్రెస్ Vs బీజేపీ.. ఏపీ సెంట్రిక్‌గా “ఉపాధి” పోరు..!

మోదీ సర్కార్ నిర్ణయానికి వ్యతిరేకంగా.. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది కాంగ్రెస్ పార్టీ. ఏపీ సెంట్రిక్‌గా ప్రారంభమైన పథకంపై.. అదే చోట కేంద్రం తీరుకు నిరసనగా..అతిపెద్ద ప్రొటెస్ట్‌కు ప్లాన్ చేస్తోంది.

కాంగ్రెస్ Vs బీజేపీ.. ఏపీ సెంట్రిక్‌గా “ఉపాధి” పోరు..!

YS Sharmila (Image Credit To Original Source)

Updated On : January 5, 2026 / 10:00 PM IST
  • మొదలుపెట్టిన చోటు నుంచే పోరుకు కాంగ్రెస్ వ్యూహాలు
  • ఉపాధి హామీలో మార్పులపై అతిపెద్ద నిరసనకు హస్తం పార్టీ ప్లాన్
  • జీ రాం జీ చట్టంపై అవగాహన యాత్ర అంటూ బీజేపీ స్కెచ్

Congress: ఒకరిది ఉనికి కోసం పోరాటం. మరొకరిది ఆధిపత్యం కోసం ఆరాటం. పేదల కోసం తాము ఎంతో ఆలోచించి తెచ్చిన పథకం రూపురేఖలు మార్చారని కాంగ్రెస్..అప్పటి కంటే ఇంకా గొప్పగా తీర్చిదిద్దామని బీజేపీ ఎవరి వాదన వారిది. ఈ నేపథ్యంలో ఏపీలో ఇంట్రెస్టింగ్‌గా పొలిటికల్ సీన్ కనిపిస్తోంది. ఆఫ్టర్‌ ఏ లాంగ్‌ నవ్యాంధ్ర సెంట్రిక్‌గా..జాతీయ పార్టీలైనా..కాంగ్రెస్, బీజేపీ ఎత్తుకు పైఎత్తు పాలిటిక్స్‌కు తెరలేపాయి.

విభజన తర్వాత ఏపీలో డిపాజిట్లు కూడా దక్కించుకోలేని పరిస్థితిల్లో..వెంటిలేటర్‌ మీద కొనసాగుతోన్న హస్తం పార్టీ..అదును చూసి కమలం పార్టీని కార్నర్ చేసే స్కెచ్ వేస్తోంది. సరిగ్గా ఇదే టైమ్‌లో ఉపాధి హామీ పథకంలో మార్పులు తెస్తూ మోదీ సర్కార్ తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్‌కు అతిపెద్ద అస్త్రంగా మారింది. ఓవైపు పార్లమెంట్‌లో..దేశవ్యాప్తంగా ఎన్డీయే సర్కార్ తీరుకు నిరసనగా విమర్శల దాడి చేస్తూనే ఉంది హస్తం పార్టీ.

సేమ్‌టైమ్‌ గతంలో ఏపీ వేదికగా పురుడు పోసుకున్న ఉపాధి స్కీమ్‌లో..ఇప్పుడు కేంద్రం తెచ్చిన మార్పులను వ్యతిరేకిస్తూ.. రాయలసీమ సెంట్రిక్‌గా అతిపెద్ద ప్రొటెస్ట్‌కు వ్యూహాలు రచిస్తోంది. దీంతో కాంగ్రెస్ స్కెచ్‌కు చెక్ పెట్టేందుకు..ఏపీలోనే హస్తం పార్టీ దూకుడుకు బ్రేకులు వేసేందుకు కమలం పార్టీ వేస్తున్న ప్లాన్స్‌..పొలిటికల్ హీట్‌ను పెంచుతున్నాయి.

Also Read: జొమాటో సీఈవో దీపిందర్ నుదుటి పక్కన పెట్టుకున్న ఈ డివైజ్‌ ఏంటి? వామ్మో.. దీనికి అంత సీన్ ఉందా?

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యూపీఏ సర్కార్-1 హయాంలో అప్పటి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. 2006 ఫిబ్రవరి నెలలో ఏపీలోని అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలోని బండ్లపల్లి గ్రామంలో ఉపాధి హామీ పథకాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. అయితే లేటెస్ట్‌గా ఉపాధి హామీ పథకం పేరును జీ రాం జీ స్కీమ్‌గా పేరు మార్చింది కేంద్రం.

దేశవ్యాప్తంగా ఆందోళనలు
అంతేకాదు ఉపాధి హామీ రూపురేఖలనే మార్చేసింది. మోదీ సర్కార్ నిర్ణయానికి వ్యతిరేకంగా..ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది కాంగ్రెస్ పార్టీ. ఏపీ సెంట్రిక్‌గా ప్రారంభమైన పథకంపై..అదే చోట కేంద్రం తీరుకు నిరసనగా..అతిపెద్ద ప్రొటెస్ట్‌కు ప్లాన్ చేస్తోంది. ఫిబ్రవరి 2న అనంతపురం జిల్లా బండ్లపల్లిలో షర్మిల దీక్ష చేయబోతున్నారు.

ఈ సభకు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే అటెండ్‌ వస్తారని అంటున్నారు. ఏఐసీసీ అగ్రనేతలు కనుక ఈ దీక్షకు వస్తే.. దేశవ్యాప్త చర్చకు దారితీయడం ఖాయం. దీంతో కాంగ్రెస్‌కు ధీటుగా బీజేపీ పెద్ద స్కెచ్చే వేసిందట. ఏపీలో కాంగ్రెస్ విమర్శలను చెక్ పెట్టాలని..జీ రాం జీ స్కీమ్‌లో తెచ్చిన మార్పులతో మేలెంత అన్నది వివరించేందుకు రెడీ అయింది.

పీవీఎన్ మాధవ్‌కు ఇంకో టాస్క్
ఈ మధ్యే అటల్ బిహారీ వాజ్‌ పేయ్‌ శతజయంతి ఉత్సవాల పేరుతో ప్రజల్లోకి వెళ్లారు ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ పీవీఎన్ మాధవ్. ఇప్పుడు ఆయనకు ఇంకో టాస్క్ అప్పగించిందట బీజేపీ అధినాయకత్వం. జీ రాం జీ చట్టంపై..అంటే ఉపాధి హామీ పథకంలో తీసుకొచ్చిన మార్పులతో ఎంత మేలు జరగబోతోందో వివరించేందుకు పీవీఎన్ మాధవ్ యాత్ర చేపట్టబోతున్నారట.

ఏపీలోని అన్ని జిల్లాలలో సభలు, సమావేశాలు పెడుతూ కొత్త చట్టం ద్వారా ప్రజలకు ఎంత ఉపయోగం జరగనుంది..గతానికి కంటే ఎక్కువగా కలిగే ప్రయోజనం ఏమిటనేది వివరించాలని చూస్తున్నారట. గతంలో ఉన్న 100 పని దినాలను 125 రోజులకు పెంచడంతో పాటు..పేదలను దృష్టిలో పెట్టుకుని పలు నిర్ణయాలను తీసుకున్నట్లు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారట.

కేంద్రం జాతీయ ఉపాధి హామీ పథకానికి గండి కొడుతోందని కాంగ్రెస్ చేస్తున్న ప్రచారానికి ఇక్కడే స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాలనేది కమలనాథుల వ్యూహంటున్నారు. అందుకే పీవీఎన్ మాధవ్‌తో యాత్రకు శ్రీకారం చుడుతున్నారని..ఈ యాత్రకు కేంద్రమంత్రులు, జాతీయ నేతలను కూడా తరలివచ్చి..కాంగ్రెస్ అలిగేషన్స్‌పై కౌంటర్‌ ఇవ్వడంతో పాటు..కమలం పార్టీకి ఇంకింత మైలేజ్‌ తెచ్చే ప్లాన్ చేస్తున్నారట. ఇలా ఉపాధి హామీ పథకంపై..ఏపీ సెంట్రిక్‌గా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ పొలిటికల్‌ ఫైట్ ఇంట్రెస్టింగ్‌గా మారేలా కనిపిస్తోంది.