BJP: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు.. వేగంగా ఏర్పాట్లు

వచ్చే నెల హైదరాబాద్‌లో జరగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది పార్టీ తెలంగాణ కార్యవర్గం. జూలై 2, 3 తేదీల్లో హైటెక్స్‌లోని నోవాటెల్ హోటల్‌లో జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతాయి.

BJP: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు.. వేగంగా ఏర్పాట్లు

Bjp

BJP: వచ్చే నెల హైదరాబాద్‌లో జరగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది పార్టీ తెలంగాణ కార్యవర్గం. జూలై 2, 3 తేదీల్లో హైటెక్స్‌లోని నోవాటెల్ హోటల్‌లో జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతాయి. ఈ సమావేశాలకు ప్రధాని నరేంద్ర మోదీతోపాటు, కేంద్ర క్యాబినెట్, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతారు.

Marriage Twist: ఇష్టంతోనే నన్ను పెళ్లి చేసుకున్నాడు: శ్రీకాంత్ భార్య లక్ష్మి

ఈ సమావేశాలను బీజేపీ తెలంగాణ కార్యవర్గం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీనికోసం 30 కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రొటోకాల్, ఆహ్వాన, స్వాగత, ఆహార, నగర సుందరీకరణ, రవాణా, మీడియా సహా మొత్తం 30 కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీల పనితీరును జాతీయ నేత అరవింద్ మీనన్ పర్యవేక్షిస్తున్నారు. అలాగే హైదరాబాద్‌లో ప్రధాని మోదీ రోడ్డు షో కోసం కూడా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. బీజేపీ కీలక స్థాయి నేతలు వస్తుండటంతో వాళ్ల సమయాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు. కార్యకర్తలను గ్రూపులుగా విభజించి వివిధ రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులతో సమావేశాలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.

Bus Accident: బస్సు ప్రమాద ఘటనలో మా సిబ్బంది తప్పిదం లేదు: ఆరెంజ్ ట్రావెల్స్

తెలంగాణలో బీజేపీని బలోపేతం చేయడమే లక్ష్యంగా వ్యూహాలు రూపొందిస్తున్నారు. ప్రతి క్రియాశీలక కార్యకర్తను ఈ సమావేశాల్లో భాగస్వామ్యం చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఈ విషయంపై రాష్ట్ర నేతలకు జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్. సంతోష్ దిశా నిర్దేశం చేశారు.