Bus Accident: బస్సు ప్రమాద ఘటనలో మా సిబ్బంది తప్పిదం లేదు: ఆరెంజ్ ట్రావెల్స్

కర్ణాటకలో శుక్రవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది హైదరాబాదీలు మరణించిన సంగతి తెలిసిందే. గోవా నుంచి ఆరెంజ్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు హైదరాబాద్ వస్తుండగా బస్సు ట్రక్కును ఢీకొంది.

Bus Accident: బస్సు ప్రమాద ఘటనలో మా సిబ్బంది తప్పిదం లేదు: ఆరెంజ్ ట్రావెల్స్

Bus Accident

Updated On : June 3, 2022 / 3:57 PM IST

Bus Accident: కర్ణాటకలో శుక్రవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది హైదరాబాదీలు మరణించిన సంగతి తెలిసిందే. గోవా నుంచి ఆరెంజ్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు హైదరాబాద్ వస్తుండగా బస్సు ట్రక్కును ఢీకొంది. ఈ ప్రమాద ఘటనపై ఆరెంజ్ ట్రావెల్స్ ప్రతినిధులు స్పందించారు.

karnataka bus accident : కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం- 8 మంది హైదరాబాదీలు మృతి

ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆరెంజ్ ట్రావెల్స్ సంస్థ మేనేజర్స్ చెప్పారు. ‘‘గత నెల 28న బస్సు హైదరాబాద్ నుంచి గోవాకు వెళ్లింది. 29న ఉదయం బస్సు గోవా చేరుకుంది. అర్జున్ కుమార్ అనే వ్యక్తి గోవాకు 26 టిక్కెట్స్ బుక్ చేసుకున్నాడు. అర్జున్ కుమార్ కుటుంబంతోపాటు, మరో ఆరుగురు ఇతర ప్రయాణికులు గోవా వెళ్లారు. అన్ని బుకింగ్స్‌కు అర్జున్ కుమార్ ఒకటే నెంబర్ ఇచ్చారు. ప్రయాణికులతోపాటు బస్సులో ఇద్దరు డ్రైవర్లు, ఒక క్లీనర్ ఉన్నారు. బస్సు ప్రమాదంలో అర్జున్ కుమార్ కూడా చనిపోయనట్లు తెలిసింది. మృతుల కుటుంబాలను సంస్థ తరఫున ఆదుకుంటాం. చనిపోయిన వారికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియలేదు. ఈ విషయంపై పోలీసులకు సమాచారం అందిస్తున్నాం. ఎన్నో ఏళ్లుగా మా ట్రావెల్స్ ద్వారా వేల మంది ప్రయాణికులను గమ్య స్థానానికి చేరుస్తున్నాం.

Marriage Twist: ఇష్టంతోనే నన్ను పెళ్లి చేసుకున్నాడు: శ్రీకాంత్ భార్య లక్ష్మి

ఎప్పుడూ ఇలాంటి ఘటనలు జరగలేదు. ఎనిమిది మంది చనిపోవడం దురదృష్టకరం. ఈ ఘటనలో మా సిబ్బంది తప్పిదం ఏమీ లేదు. బస్సుకు ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి పల్టీ కొట్టి, ఫైర్ అయ్యింది. ఏసీ బస్సు కావడం.. ఇంధనం బాక్స్ పగిలిపోవడంతో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. మా బస్సుకు సంబంధించి ఆర్‌టీఏ నిబంధనలు కచ్చితంగా పాటిస్తున్నాం’’ అని ఆరెంజ్ ట్రావెల్స్ ప్రతినిధులు చెప్పారు.