Bandi Sanjay : బీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలి : బండి సంజయ్

బీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఎందుకు అమలు చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. మహిళా గోస-బీజేపీ భరోసా దీక్ష అనే కార్యక్రమంలో పాల్గొన్న బండి సంజయ్ మాట్లాడుతూ గతంలో పోటీ చేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో కేవలం నలుగురే మహిళలు ఉన్నారని పేర్కొన్నారు.

Bandi Sanjay : బీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలి : బండి సంజయ్

sanjay

Bandi Sanjay : బీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఎందుకు అమలు చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. మహిళా గోస-బీజేపీ భరోసా దీక్ష అనే కార్యక్రమంలో పాల్గొన్న బండి సంజయ్ మాట్లాడుతూ గతంలో పోటీ చేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో కేవలం నలుగురే మహిళలు ఉన్నారని పేర్కొన్నారు. జాగృతి సంస్థలో కవిత తప్ప ఇతర మహిళలు లేరని ఎద్దేవా చేశారు. మొదటిసారి ఏర్పడిన బీఆర్ఎస్ మంత్రివర్గంలో ఒక్క మహిళ కూడా లేదన్నారు. రెండోసారి ఏర్పాటు అయిన బీఆర్ఎస్ మంత్రివర్గంలో ఇద్దరు మహిళలు ఉన్నారని పేర్కొన్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ మంత్రివర్గంలో మూడు శాతం రిజర్వేషన్లు అమలు చేయడం లేదని విమర్శించారు. సీఎం కేసీఆర్ ను ప్రశ్నించకుండా కవిత ఢిల్లీలో ధర్నా చేపట్టారని విమర్శించారు.గత ఎన్ డీఏ ప్రభుత్వంలో 1998 జులై 13న లోక్ సభలో మహిళా బిల్లు ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తే ఆర్జేడీ దాన్ని చించి వేసిందన్నారు. 1999లో ఎన్డీఏ ప్రభుత్వం మహిళా బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెడితే ప్రతిపక్షాలు అడ్డుకున్నాయని తెలిపారు. రెండు సార్లు వాజ్ పాయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంట్ లో మహిళా బిల్లు ప్రవేశపెట్టే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. దాన్ని ఆమోదించే ప్రయత్నం చేయలేదన్నారు. బీఆర్ఎస్ ఎంపీలు మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టాలని ఎందుకు పోరాటం చేయలేదన్నారు.

Telangana : లిక్కర్ స్కామ్‌లో అడ్డంగా బుక్కైన కవితను అరెస్ట్ చేయకుండా ముద్దు పెట్టుకుంటారా? బండి సంజయ్

ప్రభుత్వంపై ఎందుకు ఒత్తిడి చేయలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కేసీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు మహిళ బిల్లు ప్రవేశపెడితే ఎందుకు మద్దతు ఇవ్వలేదని ప్రశ్నించారు. తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు కేసీఆర్ పార్లమెంట్ కు రాలేదని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టాలని అడగలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో ఎందుకు మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. ఎంతమంంది మహిళలకు కార్పొరేటర్ టికెట్లు, ఎంతమంది మహిళలకు ఎమ్మెల్యే టికెట్లు, ఎంతమందికి మంత్రి పదవులు ఇచ్చారో చెప్పాలన్నారు.

కవిత దీక్షకు తాము పోటీ కాదన్నారు. అసలు కవిత చేపట్టింది దీక్షనే కాదని ఎద్దేవా చేశారు. దీక్ష చేయాల్సిన అర్హత, మహిళలకు గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ కు లేదన్నారు. బీఆర్ఎస్ పాలనలో మహిళలకు రక్షణ కరువైందని మహిళా ప్రజా ప్రతినిధులకు వేధింపులు ఎక్కువయ్యాయని పేర్కొన్నారు. తెలంగాణలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు, వేధింపులపై రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి స్పందించలేదన్నారు. కనీసం వాటిపై సమీక్ష జరుపకపోవడం దారుణం అన్నారు. తెలంగాణలో మహిళలపై దాడులు జరుగుతున్నాయని, అభద్రతా భావంలో ఉన్నారని పేర్కొన్నారు.

Bandi Sanjay : కవితను కాపాడుకునేందుకు సీఎం కేసీఆర్ పాట్లు పడుతున్నారు-బండి సంజయ్

6సంవత్సరాల బాలిక నుంచి 60 సంవత్సరాల మహిళకు వరకు ఇంటి నుంచి బయటికి వస్తే తిరిగి ఇంటికి పోలే పరిస్థితి ఉందన్నారు. వీటికి కారణం సీఎం వ్యవహార శైలి, చేతకాని తనంమహిళలపై సీఎం కోపం, కసి మొత్త ఆయన స్పందించకపోవడంతోనే బయటపడిందన్నారు. వికారాబాద్ లో బాలికపై అత్యాచారం, నిర్మల్ లో బాలికపై ఎంఐఎం పార్టీ నాయకుడు అత్యాచారం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఎందుకు కల్పించలేదో అడగటానికే బీజేపీ మహిళా మోర్చా దీక్ష చేపట్టినట్లు పేర్కొన్నారు.