Bandi Sanjay : కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంలా మారిన ప్రైవేట్ కాలేజీలు : బండి సంజయ్

ప్రయివేట్ కాలేజీల్లో కేసీఆర్ కుటుంబానికి పార్టనర్ షిప్ లేదంటే కమీషన్ ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ విమర్శించారు. కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంలా మాదిరిగా ప్రైవేట్ కాలేజీలు మారాయని ఎద్దేవా చేశారు.

Bandi Sanjay : కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంలా మారిన ప్రైవేట్ కాలేజీలు : బండి సంజయ్

Bandi Sanjay

Bandi Sanjay : ప్రయివేట్ కాలేజీల్లో కేసీఆర్ కుటుంబానికి పార్టనర్ షిప్ లేదంటే కమీషన్ ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ విమర్శించారు. కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంలా మాదిరిగా ప్రైవేట్ కాలేజీలు మారాయని ఎద్దేవా చేశారు. పోలీసులు కూడా ప్రజల కోసం కాకుండా కేసీఆర్ కుటుంబం కోసమే పని చేస్తున్నారని ఆరోపించారు. బోడుప్పల్ లో పోలీసుల చేతిలో గాయపడి మేడిపల్లి లోని అపెక్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బీజేవైఎం మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా రూరల్ అధ్యక్షులు పవన్ రెడ్డిని బండి సంజయ్ పరామర్శించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ కాలేజీలో విద్యార్థులు చనిపోతే పోలీస్ లు పట్టించుకోరా అని ప్రశ్నించారు. పోలీసులకు సిగ్గు ఉండాలి.. పోలీస్ వ్యవస్థలో కొంతమంది గుండాలుగా మారారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పీర్జాదిగూడలో బీర్ఎస్ నేతలు పేకాట ఆడితే… స్థానిక మీడియా వాళ్ళను పోలీస్ లు కొట్టారని పేర్కొన్నారు. రాష్ట్రంలో పోలీసుల ఆరాచకం ఎక్కువైందన్నారు.

KTR Vs Bandi Sanjay : చర్చకు రె‘ఢీ’..కేసీఆర్‌ను రాజీనామా పత్రం సిద్ధం చేసుకుని రమ్మను కేటీఆర్ : బండి సంజయ్

శ్రీ చైతన్య కాలేజీలో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడంపై ఆందోళన చేస్తున్న సందర్భంగా కాలేజీ యాజమాన్యం, పోలీస్ లు కలిసి మేడ్చల్ జిల్లా యువ మోర్చ అధ్యక్షుడు పవన్ పై దాడి చేశారని తెలిపారు. పవన్ తీవ్రంగా గాయపడ్డారని పేర్కొన్నారు. అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తే మీ అంతు చూస్తాం.. అని శ్రీ చైతన్య వంటి ప్రవేట్ కాలేజీలకు హెచ్చరికలు చేశారు.

రెండు కార్పొరేట్ కాలేజీల యాజమాన్యాలను హెచ్చరిస్తున్నా ..మీ సంగతి ఏంటో తేలుస్తాం.. అని హెచ్చరించారు. ప్రైవేట్ కాలేజీలను హెచ్చరిస్తున్నట్లు తెలిపారు. పేదొల్ల వద్ద ఫీజులు అడ్డగోలుగా వసూలు చేస్తే…మీ అంతు చూస్తామన్నారు. రెండు కార్పొరేట్ కాలేజీల యాజమాన్యాలను హెచ్చరిస్తున్నట్లు పేర్కొన్నారు. కొన్ని కార్పొరేట్ కాలేజీల కారణంగా గ్రామాల్లో ప్రవేటు కాలేజీలు మూసుకోవాల్సి వచ్చిందని చెప్పారు.