3 MBBS students Dies: నదిలో కొట్టుకుపోయి ముగ్గురు ఎంబీబీఎస్ విద్యార్థుల మృతి

సరదాగా గంగా నదిలో స్నానానికి వెళ్లిన ఐదుగురు ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులు నదిలో కొట్టుకుపోయారు. వారిలో ఇద్దరిని గజ ఈతగాళ్లు రక్షించగా, మరో ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని బదాయూలో చోటుచేసుకుంది.

3 MBBS students Dies: నదిలో కొట్టుకుపోయి ముగ్గురు ఎంబీబీఎస్ విద్యార్థుల మృతి

3 MBBS students Dies

3 MBBS students Dies: సరదాగా గంగా నదిలో స్నానానికి వెళ్లిన ఐదుగురు ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులు నదిలో కొట్టుకుపోయారు. వారిలో ఇద్దరిని గజ ఈతగాళ్లు రక్షించగా, మరో ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని బదాయూలో చోటుచేసుకుంది.

నదిలో నిన్న సాయంత్రం స్నానానికి వెళ్లిన ఐదుగురు ఎంబీబీఎస్ విద్యార్థులు నీళ్లలో కొట్టుకుపోయారని తెలుసుకున్న వెంటనే అధికారులు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. దాదాపు ఎనిమిది గంటల తర్వాత ఇవాళ ఉదయం విద్యార్థులు జై మౌర్య (26), పవన్ యాదవ్ (24), నవీన్ సెంగార్ (22) మృతదేహాలను ఘాట్ కి 500 మీటర్ల దూరంలో గత ఈతగాళ్లు గుర్తించారు.

అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాలేజీ విద్యార్థులు ఐదుగురు కళాశాల సిబ్బందికి చెప్పకుండా కచ్చల గంగా ఘాట్ వద్ద స్నానానికి వెళ్లారని మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ధర్మేంద్ర గుప్తా చెప్పారు. నిన్న వారిలో ఇద్దరిని మాత్రమే గత ఈతగాళ్లు రక్షించగలిగారని చెప్పారు.

మృతులు జై మౌర్య, పవన్ యాదవ్, నవీన్ సెంగార్ వరుసగా జౌన్ పూర్, బళ్లియా, హథ్రాస్ ప్రాంతాలకు చెందిన వారని వివరించారు. ప్రమాదం నుంచి బయటపడ్డ విద్యార్థుల పేర్లు ప్రమోద్ యాదవ్, అంకుశ్ గెహ్లాట్ అని వివరించారు. వారిద్దరు రాజస్థాన్ లోని గోరఖ్ పూర్, భరత్ పూర్ కు చెందిన వారని చెప్పారు.

Viral Video: నిజమైన భార్యాభర్తల బంధం అంటే ఇదే.. వైరల్ అవుతున్న వృద్ధ దంపతుల వీడియో