PM Modi: మోదీ గురించి పుస్తకమంటే రాజకీయ నాయకులకు భగవద్గీత లాంటిది – అమిత్ షా

ప్రధాని నరేంద్ర మోదీ 20ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని అర్థం చేసుకోవాలంటే, గతంలోని మూడు దశాబ్దాల పోరాటాన్ని అధ్యయం చేయడం చాలా కీలకమని అమిత్ షా వ్యాఖ్యానించారు. మోదీ@20: డ్రీమ్స్ మీటింగ్ డెలివరీ' పుస్తకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడారు.

PM Modi: మోదీ గురించి పుస్తకమంటే రాజకీయ నాయకులకు భగవద్గీత లాంటిది – అమిత్ షా

Pmmodi

 

 

PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ 20ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని అర్థం చేసుకోవాలంటే, గతంలోని మూడు దశాబ్దాల పోరాటాన్ని అధ్యయం చేయడం చాలా కీలకమని అమిత్ షా వ్యాఖ్యానించారు. మోదీ@20: డ్రీమ్స్ మీటింగ్ డెలివరీ’ పుస్తకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడారు.

రాజకీయాలు, రూలింగ్ లో ప్రధాని మోదీ చేసిన కృషికి సంబంధించిన పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు విడుదల చేశారు.

“పూర్తి వ్యక్తిత్వాన్ని నిర్మించుకునే మార్గాన్ని విశ్వసించే వారికి, సామాజిక సేవ, రాజకీయ రంగంలో ఉన్నవారికి ఈ పుస్తకం ‘గీత’తో సమానం అవుతుంది” అని అమిత్ షా అభివర్ణించారు.

Read Also: “మోదీ లేకపోతే గుజరాత్ ఉండదు” బాల థాకరే వ్యాఖ్యలను బయటపెట్టిన సీఎం ఉద్ధవ్

ప్రధాని మోదీ 3 దశాబ్దాల పోరాటం ప్రతి ఒక్కరికీ విధానాలను రూపొందించేటప్పుడు కీలకమైన సమస్యలను అర్థం చేసుకునే శక్తిని అందించిందని ఆయన అన్నారు.

20 ఏళ్లలో మోదీ సాధించిన ఘనత గురించి కూడా ఆయన మాట్లాడారు. “మోదీ ఎన్నికలలో పోటీ చేసి అనుభవం లేకుండానే గుజరాత్ సీఎం అయ్యారు. తర్వాత మళ్లీ ముఖ్యమంత్రిగా ఎన్నికవడం గొప్ప విషయమని కొనియాడారు.

మోడీ తన సీఎం హయాంలో చేపట్టిన ‘బేటీ బచావో’ కార్యక్రమాన్ని ప్రశంసించిన షా, గుజరాత్ ప్రాథమిక విద్య దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ప్రభుత్వం “విధాన పక్షవాతం” కలిగి ఉన్న సమయంలో మోదీ వచ్చారని అన్నారు.

Read Also: సీఎం సారు.. కాస్త తడబడ్డారు, అమిత్ షాను ప్రధాని చేసేశారు!

ఇలాంటి రాజకీయ నాయకులు దొరకడం అసాధ్యమని కేంద్ర మంత్రి అన్నారు. మోదీ తొందరపడి విధానాలు రూపొందించరని, అనేక ప్రతిఘటనలు ఎదురైనా వాటిని అమలు చేసేందుకు నిబద్ధతను ప్రదర్శిస్తున్నారని వివరించారు. మోదీ ప్రభుత్వం ప్రజల మధ్య మంచిగా కనిపించేందుకు నిర్ణయాలు తీసుకోదని, ప్రజలకు మేలు చేసే నిర్ణయాలను తీసుకుంటుందని వెల్లడించారు.