Unstoppable with NBK: బాప్ ఆఫ్ ఆల్ టాక్ షోస్.. స్టార్ హీరోలతో బ్యాక్ టూ బ్యాక్ ఎపిసోడ్స్!

బాప్ ఆఫ్ ఆల్ టాక్ షోస్.. టైటిల్ కి యాప్ట్ అయ్యేలా బాలయ్య ఎనర్జీకి మ్యాచ్ అయ్యేలా అన్ స్టాపబుల్ షోతో అదరగొడుతున్నారు బాలయ్య. అన్ స్టాపబుల్ ని టైటిల్ కి తగినట్టే నాన్ స్టాప్ ఎంటర్..

Unstoppable with NBK: బాప్ ఆఫ్ ఆల్ టాక్ షోస్.. స్టార్ హీరోలతో బ్యాక్ టూ బ్యాక్ ఎపిసోడ్స్!

Unstoppable With Nbk

Unstoppable with NBK: బాప్ ఆఫ్ ఆల్ టాక్ షోస్.. టైటిల్ కి యాప్ట్ అయ్యేలా బాలయ్య ఎనర్జీకి మ్యాచ్ అయ్యేలా అన్ స్టాపబుల్ షోతో అదరగొడుతున్నారు బాలయ్య. అన్ స్టాపబుల్ ని టైటిల్ కి తగినట్టే నాన్ స్టాప్ ఎంటర్ టైన్ మెంట్ అన్ స్టాపబుల్ గా షోని నడిపిస్తున్నారు బాలకృష్ణ. ఇప్పటి వరకూ ఒకలెక్క.. ఇప్పటి నుంచి ఒకలెక్క అనేలా స్టార్ హీరోలతో బ్యాక్ టూ బ్యాక్ ఎపిసోడ్స్ రెడీ చేస్తున్నారు బాలయ్య.

Pushpa: బన్నీ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. ఓటీటీలోకి పండగ తర్వాతే!

ఫస్ట్ షో దగ్గరనుంచే ఫాన్స్ లో విపరీతంగా ఎక్స్ పెక్టేషన్స్ పెంచేసింది అన్ స్టాపబుల్. మొన్నమొన్నటి వరకూ అఖండ సినిమా బిజీతో పాటు.. చేతికి సర్జరీతో కాస్త టైమ్ తీసుకున్న బాలయ్య.. ఇప్పుడు బ్యాక్ టూబ్యాక్ ఎపిసోడ్స్ తో రెడీ అయ్యారు. సీనియర్లతో పాటు మహేష్ బాబు, బన్నీ లాంటి స్టార్ హీరోలతో ఎపిసోడ్స్ చేస్తూ.. అన్ స్టాపబుల్ మీద క్రేజ్ పెంచేస్తున్నారు బాలకృష్ణ.

RRR: బ్లాస్టింగ్ ఎపిసోడ్‌కు గెస్టులుగా చిరు-బాలయ్య.. బొమ్మ దద్దరిల్లాల్సిందే!

బాలయ్య యంగ్ హీరోల్ని అంతగా మ్యాచ్ చెయ్యలేడేమో అనుకున్నవాళ్లకి.. అంతకుమించి ఎంటర్ టైన్ మెంట్ జనరేట్ చేస్తున్నారు బాలకృష్ణ. అసలు సీరియస్ గా కనిపించే బాలయ్య.. షోలో కౌటర్లు, పంచ్ లతో గెస్ట్ లని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఇప్పటికే ఇంట్రస్టింగ్ గా సాగుతున్న అన్ స్టాపబుల్ షోలో డిసెంబర్ 25న ప్రీమియర్ అవుతున్న బన్నీ ఎపిసోడ్ ఎంటర్ టైన్ మెంట్ ని డబుల్ చెయ్యబోతోంది.

Unstoppable Aha: ఇది వేరే లెవెల్.. బాలయ్య షోలో జక్కన్న-కీరవాణి!

బన్నీ కంటే ముందే బాలకృష్ణ స్టార్ హీరో మహేష్ బాబుతో ఎపిసోడ్ షూటింగ్ చేసేశారు. లేటెస్ట్ గా మాస్ మహారాజారవితేజతో కూడా మరో ఎంటర్ టైనింగ్ ఎపిసోడ్ కంప్లీట్ చేసేశారు. ఇలా తన మ్యాజిక్ ని ఆడియన్స్ కి కనెక్ట్ చేసిన బాలయ్య.. బ్యాక్ టూ బ్యాక్ ఇంట్రస్టింగ్ ఎపిసోడ్స్ తో అన్ స్టాపబుల్ గా షో ని హిట్ చేస్తున్నారు. ఏమాత్రం ఫిల్టర్లు లేకుండా బాలయ్య చేస్తున్న ఈ షో ఆహాలోనే టాప్ స్ట్రీమింగ్ తో దూసుకుపోతోంది.