Banglore Dog Burney : ఫైవ్ స్టార్ హోటల్ లో కుక్కకు ఉద్యోగం..చీఫ్ హ్యాపీనెస్ ఆఫీసర్ హోదా..భారీగా జీతం..!!

ఓ ఫైవ్ స్టార్ హోటల్ యజమాని ఓ కుక్కకు చీఫ్ హ్యాపీనెస్ ఆఫీసర్ హోదా ఇచ్చారు. అంతేకాదు ఆ కుక్కకు భారీ మొత్తంలో జీతం ఇస్తున్నారు..

Banglore Dog Burney : ఫైవ్ స్టార్ హోటల్ లో కుక్కకు ఉద్యోగం..చీఫ్ హ్యాపీనెస్ ఆఫీసర్ హోదా..భారీగా జీతం..!!

Burney

Banglore Five star hotel Dog : ప్రతి కుక్కకూ.. ఓ రోజు వస్తుందంటారు. కానీ.. అది ఏ రోజో చెప్పరు. అదెప్పుడొస్తుందో తెలియదు. కానీ.. ఏదో ఒక రోజు మాత్రం.. కచ్చితంగా ఆ రోజు వస్తుంది. ఆ రోజుకి.. ఆ కుక్కే కింగ్. అయితే.. ఇప్పుడు చూపించబోయే కుక్కకు మాత్రం.. ప్రతి రోజు తన రోజే. ఫైవ్ స్టార్ హోటల్‌లో జాబు, చీఫ్ హ్యాపీనెస్ ఆఫీసర్ అనే పోస్టు, మంచి జీతం.. అబ్బో విషయం చాలానే ఉంది. జస్ట్.. నాలుక బయటపెట్టి.. గట్టిగా నాలుగు సార్లు తోక ఊపితే చాలు. అంతే.. దానికే పడిపోతున్నారంతా.

ప్రపంచంలో ఎన్నో చేదు విషయాలు, ద్వేషంతో కూడిన కథలే కాదు.. కరుణ, జాలి, దయతో కూడిన కథలు కూడా ఉన్నాయ్. అలాంటి వాటిలో.. బర్నీ లైఫ్ కూడా ఒకటి.ఈ కుక్క పేరు బర్నీ. దీనినెవరో రోడ్డు మీద వదిలేశారు. ఎక్కడికెళ్లాలో తెలియదు. అలా.. అలా.. నడచుకుంటూ.. బెంగళూరులోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ గేటు ముంది ఆగింది. జనరల్‌గా అయితే.. అక్కడి నుంచి దాన్ని వెళ్లగొట్టేస్తారు. కానీ.. అలా జరగలేదు. అలాగే జరిగి ఉంటే.. ఇలాగా మనం డిస్కస్ చేసుకునే వాళ్లం కాదు. ఆ ఫైవ్ స్టార్ హోటల్.. బర్నీకి వెల్‌కమ్ చెబుతూ గేట్లు ఓపెన్ చేయడం మాత్రమే కాదు.. దానికి ఉద్యోగమిచ్చి ఉపాధి కూడా కల్పించింది.

బర్నీ.. బెంగళూరులోని లలిత్ అశోక్ హోటల్‌కి వచ్చినప్పుడు.. గాయాలతో ఉంది. ఎంతో భయంతో, ఒంటరిగా ఫీలవుతూ కనిపించిందట. కానీ.. హోటల్ సిబ్బంది మనస్ఫూర్తిగా దానిని ఆహ్వానించడంతో పాటు దానికో.. ఐడీ కార్డ్ ఇచ్చి.. చీఫ్ హ్యాపీనెస్ ఆఫీసర్ అనే హోదాతో.. ఉద్యోగం కూడా ఇచ్చారు. కుక్కలకు విశ్వాసం ఎక్కువ కదా. ఏది వాటి దగ్గర ఉంచుకోవు. తిరిగిచ్చేస్తుంటాయ్. బర్నీ కూడా అదే చేసింది. తనకెంతో ప్రేమను పంచిన.. హోటల్ సిబ్బందికి.. తిరిగి ప్రేమను పంచడం మొదలుపెట్టింది. అక్కడున్న వాళ్లందరితో.. ఫ్రెండ్ షిప్ చేయడం స్టార్ట్ చేసింది. అలా.. హోటల్‌లోనే.. గౌరవ ఉద్యోగిగా మారిపోయింది.

హోటల్‌లో బర్నీ బిహేవియర్ చాలా క్యూట్‌గా ఉంటుంది. గెస్టులను, ఉద్యోగుల నవ్వేలా చేయడం మాత్రమే కాదు.. ఊహించని విధంగా.. వారితో కనెక్షన్ ఏర్పరచుకుంటుంది. గెస్టులు కూడా బర్నీతో టైమ్ స్పెండ్ చేసేందుకు.. చాలా ఇంట్రస్ట్ చూపుతున్నారు. ఎలాంటి అతిథి అయినా.. వారిని ఇబ్బంది పెట్టకుండా.. సౌకర్యంగా ఫీలయ్యేలా ఉంటుంది బర్నీ ప్రవర్తన. గెస్టులిచ్చే.. హగ్స్ ఎప్పుడూ రెడీగా ఉంటుందని.. హోటల్ సిబ్బంది చెబుతున్నారు.

బర్నీకి.. సాధారణ హోటల్ సిబ్బందిలాగే.. జీతం కూడా చెల్లిస్తారు. అది.. లాబీ మీటింగ్స్‌కి కూడా అటెండ్ అవుతుంది. తన వూఫ్‌లు, పూఫ్‌లతో.. అంగీకారాన్ని, అసమ్మతిని తెలియజేస్తుంది. హోటల్‌లో ఉద్యోగులందరికీ.. బర్నీయే ఇప్పుడు స్ట్రెస్ బస్టర్. హగ్స్ ఇవ్వడం, హలో చెప్పడంతో.. అందరినీ ఫుల్ ఖుషీ చేస్తుంది. అలా.. ఇంటర్నెట్‌లో బాగా పాపులర్ అయిపోయింది. దీని వల్ల.. హోటల్‌కు కూడా మంచి పేరొచ్చింది. ఇన్ స్టాగ్రామ్‌లో.. దీని వీడియోలకు చాలా లైక్స్ వచ్చాయ్.

 

View this post on Instagram

 

A post shared by The Lalit Ashok Bangalore (@thelalitbangalore)