Bengaluru : అతను పోగొట్టుకున్న వాలెట్ ఎలా దొరికిందంటే? ఇంట్రెస్టింగ్ చదవండి.

ఈరోజుల్లో ఏదైనా వస్తువు పోగొట్టుకుంటే తిరిగి దొరకడం అంత ఈజీనా? బెంగళూరులో ఓ వ్యక్తి తన వాలెట్ పోగొట్టుకున్నాడు. కానీ ఆశ్చర్యంగా తిరిగి పొందాడు ఎలానో చదవండి.

Bengaluru : అతను పోగొట్టుకున్న వాలెట్ ఎలా దొరికిందంటే? ఇంట్రెస్టింగ్ చదవండి.

Bengaluru

Bengaluru :  పోయిన సెల్ ఫోన్.. కోల్పోయిన వాలెట్ తిరిగి దొరకడం అంటే చాలా అదృష్టం ఉండాలి. బెంగళూరులో ఓ వ్యక్తి కేఫ్‌లో పోగొట్టుకున్న వాలెట్‌ను తిరిగి ఎలా పొందాడో ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.

Saint Von Colucci : అతడిలా కనిపించేందుకు 12 సర్జరీలు.. చివరికి ప్రాణం పోగొట్టుకున్న నటుడు!

ఇప్పుడంతా ఆన్‌లైన్ కదా.. చాలామంది వాలెట్‌లలో డబ్బులు కనిపించట్లేదు. క్రెడిట్ ,డెబిట్ కార్డులు, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్‌తో నింపేస్తున్నారు. అవి ఎప్పుడైనా మిస్ అయితే తల పట్టుకోవాల్సిందే. డబ్బు పోయినా తిరిగి ఆ కార్డులు, డాక్యుమెంట్స్ తిరిగి సంపాదించాలంటే మామూలు పని కాదు. పోనీ వాలెట్‌లో డబ్బులు తీసుకుని ఆ కార్డులైనా మా ముఖాన పడేయచ్చు కదా అని బాధపడేవాళ్లు ఉన్నారు.

 

విషయానికి వస్తే ట్విట్టర్ యూజర్ రోహిత్ ఘుమారేకి ఇలాంటి పరిస్థితి ఎదురైంది. బెంగళూరులోని ఓ కేఫ్‌కి వెళ్లాడు. అక్కడ తన వాలెట్‌ని పోగొట్టుకున్నాడు. ఇక ఆ వాలెట్ నిండా క్రెడిట్, డెబిట్ కార్డులు ఉన్నాయి. అంతే చాలా బాధపడ్డాడు. అయితే ఆశ్చర్యంగా ఆ కేఫ్ నుంచి అతనికి కాల్ వచ్చింది. మీ వాలెట్ ఇక్కడ మర్చిపోయారు అని.. వాళ్లకి నా నంబర్ ఎలా తెలిసింది? అని రోహిత్ ఆశ్చర్యపోయాడు. ‘ బహుశా గూగుల్‌లో చూసి ఉంటారని ఊహిస్తున్నానంటూ’ @ghumare64 అనే తన ట్విట్టర్ అకౌంట్ నుంచి ఈ విషయాన్ని షేర్ చేశాడు. మొత్తానికి రోహిత్ కేఫ్ వాళ్ల పుణ్యమా అని పోయిన తన వాలెట్‌ని తిరిగి పొందాడన్నమాట. ఇక ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

iPhone Lost in Sea : సముద్రంలో ఐఫోన్ పోగొట్టుకున్న మహిళ.. ఏడాది తర్వాత దొరికిన ఆ ఫోన్ కండిషన్ చూసి షాకైంది..!

‘ఆ కేఫ్ పేరు తెలుసుకోవాలని ఉందని ఒకరు.. మీ వాలెట్ మీరు పొందినందుకు సంతోషం అని ఇంకొకరు.. గతంలో తాను కూడా ఐఫోన్‌ను ఇలాగే పొందగలిగాను’ అని ఒకరు రిప్లై చేశారు. ఏది ఏమైనా రోహిత్ పోయిన తన వాలెట్‌ని పొందడం అదృష్టమైతే ఆ కేఫ్ వారి మంచితనాన్ని కూడా మెచ్చుకోవాల్సిందే.