Gajjala Kantham: బండి సంజయ్‌పై సీబీఐ, ఈడీ దాడులు చేయించాలి.. ప్రజా సంఘాల జేఏసీ ఛైర్మన్ గజ్జల కాంతం డిమాండ్

మూడేళ్ల క్రితం టు వీలర్ మీద తిరిగిన బండి సంజయ్ బీజేపీ అధ్యక్షుడు అయిన వెంటనే కార్లలో తిరుగుతున్నారు. సంజయ్‌కి రూ.1,000 కోట్ల ఆదాయం ఉంది. కరీంనగర్‌లో గ్రానైట్, వజ్రాల షాప్స్, అనేక సంస్థలను బెదిరించి డబ్బులు వసూలు చేశారు. దమ్ముంటే సంజయ్‌పై సిబిఐ, ఈడీ దాడులు చేయండి. 

Gajjala Kantham: బండి సంజయ్‌పై సీబీఐ, ఈడీ దాడులు చేయించాలి.. ప్రజా సంఘాల జేఏసీ ఛైర్మన్ గజ్జల కాంతం డిమాండ్

Gajjala Kkantham: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అవినీతికి పాల్పడుతున్నాడని, ఆయనపై సీబీఐ, ఈడీ దాడులు చేయించాలని డిమాండ్ చేశారు ప్రజా సంఘాల జేఏసీ ఛైర్మన్ గజ్జల కాంతం. ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ గజ్జల కాంతం మీడియాతో మాట్లాడారు.

Bandi Sanjay Comments: మహిళల్ని అవమానించిన బండి సంజయ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి.. బీఆర్ఎస్ మహిళా మంత్రుల డిమాండ్

ఈ సందర్భంగా బీజేపీ, బండి సంజయ్‌పై విమర్శలు చేశారు. ‘‘బండి సంజయ్ నీతి నిజాయితీ పరుడు అని అనుకుంటున్నారు. మూడేళ్ల క్రితం టు వీలర్ మీద తిరిగిన బండి సంజయ్ బీజేపీ అధ్యక్షుడు అయిన వెంటనే కార్లలో తిరుగుతున్నారు. సంజయ్‌కి రూ.1,000 కోట్ల ఆదాయం ఉంది. కరీంనగర్‌లో గ్రానైట్, వజ్రాల షాప్స్, అనేక సంస్థలను బెదిరించి డబ్బులు వసూలు చేశారు. దమ్ముంటే సంజయ్‌పై సిబిఐ, ఈడీ దాడులు చేయండి. మహిళలపై గౌరవం లేకుండా సంజయ్ నీచంగా మాట్లాడుతున్నారు. బిజెపి అధ్యక్షుడిగా తెలంగాణలో ఉండి అధికారంలోకి వస్తామని ఇతరులను బెదిరిస్తున్నారు.

Bandi Sanjay Comments: బండి సంజయ్ వ్యాఖ్యలపై మహిళా కమిషన్ ఆగ్రహం.. పోలీస్ కేసు నమోదు

బిజెపి, ఆర్ఎస్ఎస్ అని చెప్పుకొని కోట్లాది రూపాయలు సంజయ్ సంపాదిస్తున్నాడు. దేశంలో రాక్షస పాలన కొనసాగుతుంది. కవితపై అక్రమ కేసులు పెట్టి తెలంగాణ ఆడబిడ్డను విచారణ చేస్తున్నారు. విచారణ పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారు. బీజేపీ, మోదీ, అమిత్ షాకు మహిళలంటే గౌరవం లేదు. హిందూ వారసులం అంటారు కానీ సీతను గౌరవించరు. సీతను గౌరవించని వారు ఈ దేశ మహిళలను గౌరవించారు. కవితను ఈడీ విచారించడం బాధాకరం. బీజేపీకి నీతి, నిజాయితీ లేదు. అసలు దొంగలను విడిచి ఇతరులను విచారిస్తున్నారు.

కేంద్ర సంస్థలను ప్రైవేటీకరణ చేసి అదానికి అప్పజెప్పారు. అమిత్ షా బినామీ అదాని. ఇది నిజం. కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడే వారిపై అక్రమ కేసులు పెడుతున్నారు. కెసిఆర్ తెలంగాణలో అనేక స్కీమ్స్ పెట్టారు’’ అని గజ్జల కాంతం వ్యాఖ్యానించారు.