Bandi Sanjay Comments: మహిళల్ని అవమానించిన బండి సంజయ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి.. బీఆర్ఎస్ మహిళా మంత్రుల డిమాండ్

మ్మెల్సీ కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ మహిళా మంత్రులు, పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ బీజేపీ, బండి సంజయ్‌పై విమర్శలు చేశారు.

Bandi Sanjay Comments: మహిళల్ని అవమానించిన బండి సంజయ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి.. బీఆర్ఎస్ మహిళా మంత్రుల డిమాండ్

Bandi Sanjay Comments: మహిళలను అవమానించిన బండి సంజయ్‌ను బీజేపీ నుంచి సస్పెండ్ చేయాలని బీఆర్ఎస్ మహిళా మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ మహిళా మంత్రులు, పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Delhi Liquor Scam MLC kavitha : తండ్రి కేసీఆర్ లక్కీ నంబర్ ‘6’ తోనే ఈడీ విచారణకు వెళ్లిన ఎమ్మెల్సీ కవిత

ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ బీజేపీ, బండి సంజయ్‌పై విమర్శలు చేశారు. సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ‘‘మహిళలను అవమానించిన బండి సంజయ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. బీజేపీ ఎందుకు మహిళా గోస పేరుతో నిరసన చేపట్టిందనేది వారికే తెలియదు. దేశంలో మోదీ ఆడింది ఆట, పాడింది పాటగా మారింది. కేసిఆర్ దేశం బాట పట్టడంతో బీజేపీ నేతలకు భయం పట్టుకుంది. తెలంగాణ మోడల్ పథకాలతో ఆయన జనాన్ని ఎక్కడ ఆకట్టుకుంటే తమకు నష్టం కలుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. అందుకే మోదీ చేతిలో ఉన్న దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు కోసం కవిత ఆందోళన చేపట్టడంతో దేశంలోని మహిళలంతా ఎక్కడ ఏకమైపోతారోనని బీజేపీ ఇలా సుమన్లు పంపి వేధిస్తోంది.

Delhi Liquor Case: కవితను ప్రశ్నిస్తున్న ఈడీ.. ఆఫీసు దగ్గర టెన్షన్ టెన్షన్

బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు ఆయన దేశంలోని మహిళలందరికీ క్షమాపణ చెప్పాలి. రాజకీయాల్లో మాట్లాడే సందర్భాల్లో పద్ధతి, గౌరవం ఉండాలి. ఎప్పుడు మాట్లాడినా కేసీఆర్‌ను, ఆయన కుటుంబ సభ్యులను వ్యక్తిగతంగా దూషించడం తప్ప చేసిందేమైనా ఉందా? స్థానిక సంస్థల్లో 50 శాతం మహిళా రిజర్వేషన్ల అమలు జరుగుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. గ్రామ పంచాయితీల్లో వార్డ్ మెంబెర్స్, సర్పంచ్‌లలో సగం మంది మహిళలు ఉన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ సహా అన్నింట్లో మహిళలకు ప్రాధాన్యత కనిపిస్తుంది. తెలంగాణలో అమలవుతున్న మహిళా సంక్షేమ పథకాలు దేశంలో మరెక్కడా లేవు. కళ్యాణ లక్ష్మి తరహా పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మరెక్కడైనా ఉన్నాయా? ఇంటింటికీ తాగు నీరు అందిస్తున్న పరిస్థితి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉందా?

Delhi Liquor Scam : కవిత ఈడీ విచారణపై సీఎం కేసీఆర్ ఆరా.. ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్న గులాబీ బాస్

నిజానికి ఇవన్నీ కేంద్రం స్ఫూర్తిగా తీసుకుని దేశమంతటా అమలు చేయాల్సిన పథకాలు. దేశంలో ఎక్కడా లేని విధంగా షీ టీమ్స్ ఏర్పాటు చేసిన తెలంగాణ సర్కారును బీజేపీ ఎలా తప్పుబడుతోంది’’ అని సబితా ఇంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. అనంతరం మరో మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడారు. ‘‘సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడయ్యాక రాష్ట్రంలో రాజకీయ విలువలు పడిపోయాయి. సభ్య సమాజం తలదించుకునేలా ఆయన మాటలు ఉన్నాయి. ఆ వ్యాఖ్యలు బండి సంజయ్ వ్యక్తిగతమా లేక పార్టీ వైఖరి కూడా అదేనా అన్నది స్పష్టం చేయాలి. మహిళా రిజర్వేషన్ల బిల్లు కోసం దీక్ష చేస్తే ఈడీ నోటీసులు ఇస్తుంది. తెలంగాణలో మహిళలకు 33% కాదు, 50% రిజ్వేషన్లు అమలు చేస్తున్నాం.

బిజెపిలో ఉన్న దొంగల మీద ఎన్ని ఈడీ కేసులు పెట్టారు? మీకు ఎదురు తిరిగితే ఈడీని వేట కుక్కల్లా ఉసిగొల్పుతున్నారు. వ్యాపారం చేసుకునే మా ఎంపీలమీద, మంత్రులమీద, కవిత మీద కేసులు పెట్టారు. ఈ కేసులకు భయపడం. బండి సంజయ్, నీకు, నీ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కవు. బీజెపి తన రాజకీయ ఔన్నత్యాన్ని చాటుకోవాలంటే సంజయ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి, బహిష్కరించాలి’’ అని సత్యవతి రాథోడ్ అన్నారు.