Karthi Chidambaram : కాంగ్రెస్ నేత పి.చిదంబరం కుమారుడిపై మరో సీబీఐ కేసు

సీబీఐ వర్గాల సమాచారం ప్రకారం... కొత్తగా నమోదు చేసిన కేసులో ఆరోపణలు అన్ని ప్రధానంగా కార్తీ చిదంబరంపైనే ఉన్నట్లు సీబీఐ వర్గాలు వెల్లడించాయి.

Karthi Chidambaram : కాంగ్రెస్ నేత పి.చిదంబరం కుమారుడిపై మరో సీబీఐ కేసు

Karti Chidambaram

Updated On : May 17, 2022 / 11:31 AM IST

Karthi Chidambaram : మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం కుమారుడు కార్తి చిదంబరంపై మరో సీబీఐ కేసు నమోదు అయింది. 2010-14 మధ్య కాలంలో లావాదేవీలు, విదేశీ డబ్బు పంపిన ఆరోపణలపై కార్తీ చిదంబరంపై సీబీఐ కొత్త కేసు నమోదు చేసింది. ముంబై, ఢిల్లీ, తమిళనాడులోని 9 ప్రదేశాల్లో సీబీఐ బృందాలు సోదాలు నిర్వహిస్తున్నాయి.

చెన్నై, ఢిల్లీలోని పి.చిదంబరం ఇంటిపై కూడా సీబీఐ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. చిదంబరం ఇంటి వద్ద ఉదయం 8గం.ల నుంచే సోదాలు చేస్తున్నట్లు వెల్లడించారు. సీబీఐ వర్గాల సమాచారం ప్రకారం… కొత్తగా నమోదు చేసిన కేసులో ఆరోపణలు అన్ని ప్రధానంగా కార్తీ చిదంబరంపైనే ఉన్నట్లు సీబీఐ వర్గాలు వెల్లడించాయి.

P Chidambaram : కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం ఇళ్లు, ఆఫీస్‌లపై సీబీఐ దాడులు

సుమారు రూ.50 లక్షలు తీసుకుని… చైనాకు చెందిన పలువురికి వీసా ఇప్పించారని ఆరోపణలున్నాయి. చెన్నైలో -3, కర్ణాటకలో -1, ముంబైలో -3 పంజాబ్ లో -1 ఒడిశాలో -1 ప్రదేశాల్లో సోదాలు కొనసాగుతున్నాయి.