మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ పై సిబిఐ ఉచ్చు

మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ అవినీతి ఆరోపణలకు సంబంధించి సెంట్రల్ బ్యూరో అఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) కేసు నమోదు చేసి సోదాలు నిర్వహిస్తున్నట్లు ఏజెన్సీ అధికారి తెలిపారు.

మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ పై సిబిఐ ఉచ్చు

Maharashtra Home Minister Anil Deshmukh

మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ అవినీతి ఆరోపణలకు సంబంధించి సెంట్రల్ బ్యూరో అఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) కేసు నమోదు చేసి సోదాలు నిర్వహిస్తున్నట్లు ఏజెన్సీ అధికారి తెలిపారు. ప్రస్తుతం వివిధ ప్రదేశాలలో సోదాలు జరుగుతున్నాయని అధికారి శనివారం చెప్పారు. బొంబాయి హైకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ ఈ ఆరోపణలపై ప్రాథమిక విచారణను ప్రారంభించింది. కాగా అనిల్ దేశ్ ముఖ్ ప్రకటనను దర్యాప్తు బృందం గతంలో రికార్డ్ చేసింది.

అలాగే ముంబై మాజీ పోలీసు చీఫ్ పరమ బిర్ సింగ్ , డిప్యూటీ పోలీస్ కమిషనర్ సంజయ్ పాటిల్, అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్ సచిన్ వాజే ల స్టేట్మెంట్ ను సిబిఐ రికార్డ్ చేసింది.. ఈ విషయంలో ఫిర్యాదు చేసిన జయశ్రీ పాటిల్ స్టేట్మెంట్ ను కూడా రికార్డ్ చేశారు. ఆమె ఆరోపించినట్లుగా కొంతమంది పోలీసు అధికారులకు ముంబైలోని బార్లు , రెస్టారెంట్ల నుండి ప్రతి నెలా 100 కోట్లు వసూలు చేయాలని అనిల్ దేశ్ ముఖ్ ఆదేశించినట్టు స్టేట్మెంట్ లో పేర్కొన్నట్టు తెలుస్తోంది. ఇక ఈ ఆరోపణలపై ప్రాథమిక విచారణ జరపాలని సిబిఐని హైకోర్టు ఆదేశించిన తరువాత, దేశ్ ముఖ్ తన పదవికి రాజీనామా చేశారు.