Fake Doctors: పరీక్షలో ఫెయిలైనా ప్రాక్టీస్ చేస్తున్న డాక్టర్లు.. సీబీఐ కేసు నమోదు.. నిందితులు విదేశాల్లో చదివిన డాక్టర్లు

విదేశాల్లో మెడికల్ కోర్స్ పూర్తి చేసి వచ్చిన డాక్టర్లు ఇండియాలో ప్రాక్టీస్ చేయాలంటే ఇక్కడి ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే పరీక్షలు పాసవ్వాలి. లేకుంటే వీళ్లు డాక్టర్లుగా సేవ చేసేందుకు అనర్హులు. కానీ, ఇలా కొందరు ఫెయిలై కూడా డాక్టర్లుగా పనిచేస్తున్నారు.

Fake Doctors: పరీక్షలో ఫెయిలైనా ప్రాక్టీస్ చేస్తున్న డాక్టర్లు.. సీబీఐ కేసు నమోదు.. నిందితులు విదేశాల్లో చదివిన డాక్టర్లు

Fake Doctors: విదేశాల్లో ఎంబీబీఎస్ లేదా సంబంధిత మెడికల్ కోర్స్ చదువుకుని ఇండియా వచ్చిన వాళ్లు మన దేశంలో ప్రాక్టీస్ చేయాలంటే ఇక్కడి పరీక్షలు పాసవ్వాల్సి ఉంటుంది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వంటి కేంద్ర సంస్థలు నిర్వహించే పరీక్షల్లో పాసవ్వాలి.

Telangana: కీలక మలుపు తిరిగిన ఎమ్మెల్యేల ప్రలోభాల కేసు.. విచారణ సీబీఐకి బదిలీ చేస్తూ హైకోర్టు ఆదేశం

ఆ తర్వాతే వీరికి నేషనల్ మెడికల్ కమిషన్ లేదా రాష్ట్ర కౌన్సిల్స్‌లో రిజిస్ట్రేషన్ చేసుకునే అర్హత లభిస్తుంది. ఇలా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాతే దేశంలో ఎక్కడైనా డాక్టర్లుగా పనిచేసుకోవచ్చు. అర్హత పరీక్షలు పాసవ్వకుండా ప్రాక్టీస్ చేయడం చట్ట ప్రకారం నేరం. కానీ, ఇటీవలి కాలంలో దేశంలో కొందరు డాక్టర్లు ఈ పరీక్షలు పాసవ్వకుండానే ప్రాక్టీస్ చేస్తున్నట్లు కేంద్రం గుర్తించింది. రష్యా, యుక్రెయిన్, చైనా వంటి దేశాల్లో 2011-2022 వరకు వైద్య విద్య చదువుకుని ఇండియా వచ్చిన వాళ్లలో కొందరు అర్హత పరీక్షల్లో ఫెయిలయ్యారు. అయినప్పటికీ, అధికారుల సాయంతో అక్రమమార్గంలో అనుమతులు పొంది డాక్టర్లుగా పని చేస్తున్నారు. ఇలా విదేశాల్లో చదువుకుని వచ్చి, ఫెయిలైన డాక్టర్లు 73 మంది అక్రమంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. వీళ్లు విదేశాల్లో పీజీ కోర్సు చేసి వచ్చారు.

Viral Video: వెడ్డింగ్ ఫొటో షూట్‌లోకి దూసుకొచ్చిన కోతి.. తర్వాత ఏం జరిగిందంటే.. ఆసక్తికర వీడియో

ఈ డాక్టర్లు ఎక్కువగా బిహార్, ఉత్తర ప్రదేశ్, అసోంలలోనే ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇక్కడ వీళ్లు అక్రమంగా ప్రాక్టీస్ చేసేందుకు నేషనల్ మెడికల్ కౌన్సిల్, రాష్ట్ర మెడికల్ కౌన్సిల్‌కు చెందిన అధికారులు సాయం చేసినట్లు కూడా కేంద్రం గుర్తించింది. వీరందరిపై ఇప్పుడు సీబీఐ కేసు నమోదు చేసి విచారణ జరుపుతోంది. వీళ్లందరిపై క్రిమినల్, ఫోర్జరీ, చీటింగ్, అవినీతికి పాల్పడ్డ అంశాల్లో కేసులు నమోదు చేసింది సీబీఐ. నిందితులపై విచారణ జరిపి, తదుపరి చర్యలు తీసుకుంటామని సీబీఐ అధికారులు తెలిపారు. కేంద్ర ఆరోగ్య శాఖ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.