Zika Virus: మహాలో జికా కలకలం.. కేంద్రం ప్రత్యేక దృష్టి!

ఒకవైపు కరోనా మహమ్మారి రూపాంతరాలు చెందుతూ ప్రజలను ఇంకా భయపెడుతూనే ఉంది. మన దేశంలో ఇంకా సెకండ్ వేవ్ ముగియక ముందే థర్డ్ వేవ్ హెచ్చరికలు వస్తూనే ఉన్నాయి. ఇక ఇది చాలదని జికా వైరస్ కూడా ప్రబలుతోంది. ఇప్పటికే కేరళతో పాటు మరికొన్ని రాష్ట్రాలలో వెలుగుచూసిన జికా వైరస్ తాజాగా మహారాష్ట్రలో కూడా వెలుగు చూసింది.

Zika Virus: మహాలో జికా కలకలం.. కేంద్రం ప్రత్యేక దృష్టి!

Zika Virus

Zika Virus: ఒకవైపు కరోనా మహమ్మారి రూపాంతరాలు చెందుతూ ప్రజలను ఇంకా భయపెడుతూనే ఉంది. మన దేశంలో ఇంకా సెకండ్ వేవ్ ముగియక ముందే థర్డ్ వేవ్ హెచ్చరికలు వస్తూనే ఉన్నాయి. మహమ్మారి రూపాలు మారుస్తూ వేరియంట్ల మీద వేరియంట్లుగా పుట్టుకొస్తూనే ఉంది. ఇక ఇది చాలదని జికా వైరస్ కూడా ప్రబలుతోంది. ఇప్పటికే కేరళతో పాటు మరికొన్ని రాష్ట్రాలలో వెలుగుచూసిన జికా వైరస్ తాజాగా మహారాష్ట్రలో కూడా వెలుగు చూసింది.

మహారాష్ట్రలో పూణె జిల్లాలోని పురందర్ తహసీల్ పరిధిలో 50ఏళ్ల మహిళకు లక్షణాలు కనిపించడంతో పరీక్షలు జరిపారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV)జులై 30న ఆమెకు పరీక్షలు జరిపి జికా వైరస్ గా ఖరారు చేశారు. దీనిపై ఇప్పుడు కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది. తాజాగా కొంత మంది వైద్య నిపుణుల బృందాన్ని మహారాష్ట్రకు పంపించింది.

ఈ బృందంలో హార్డింగ్ మెడికల్ కాలేజీ గైనకాలజిస్ట్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మలేరియా రీసెర్చ్ నుంచి ఓ ఎంటమాలిజిస్ట్ సభ్యులుగా ఉండగా మొత్తం ముగ్గురు ఈ బృందంలో ఉన్నారు. మహారాష్ట్రలో ఆరోగ్య పరిస్థితులపై అధ్యయనం చేసి ఈ బృందం కేంద్ర ఆరోగ్య శాఖకు సిఫార్సు చేయనుంది.