Corana Cases : దేశంలో మరోసారి పెరిగిన కరోనా కేసులు

గత రెండు రోజులుగా దేశంలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. బుధవారం 37,800 కరోనా కేసులు నమోదు కాగా గురువారం 42,263 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Corana Cases : దేశంలో మరోసారి పెరిగిన కరోనా కేసులు

Corana Cases

Corana Cases : గత రెండు రోజులుగా దేశంలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. బుధవారం 37,800 కరోనా కేసులు నమోదు కాగా గురువారం 42,263 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,31,39,981 చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో కరోనాతో 338 మంది మృతి చెందారు.. ఇప్పటివరకు దేశంలో కరోనా మహమ్మారి కారణంగా 4,41,749 మంది మరణించారు.

దేశంలో నమోదవుతున్న కేసుల్లో 70 శాతం కేసులు కేరళలోనే నమోదవుతున్నాయి. గురువారం కేరళలో 30,196 కరోనా కేసులు నమోదయ్యాయి. కేసుల సంఖ్య విపరీతంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇక గడిచిన 24 గంటల్లో కేరళలో 181 మంది మృతి చెందారు. మరణాల రేటు కూడా ఇక్కడే అధికంగా ఉంది. దేశంలో నమోదవుతున్న మరణాల్లో 50 శాతం కేరళలోనే ఉన్నాయి.

ఇక ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 3,93,614 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటంతో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేరళలో విపరీతంగా కేసులు పెరుగుతుండటంపై అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు దేశంలో రికవరీ రేటు కూడా అధికంగా ఉంది. 97.48 శాతం మంది కరోనా నుంచి కోలుకొని ఇళ్లకు వెళ్లారు. 1. 19 శాతం మంది దేశంలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

వ్యాక్సినేషన్

మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. భారత్ లో 237 రోజులుగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. బుధవారం సాయంత్రం వరకు 71.65 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చారు. ఇక బుధవారం ఒక్కరోజే 86,51,701 డోసుల వ్యాక్సిన్ అందించారు. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేంగంగా సాగుతుందని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది.

కరోనా పరీక్షలు

భారత్ లో 53.6853,68,17,243 కరోన నిర్ధారణ పరీక్షలు చేశారు. దేశ వ్యాప్తంగా 2920 ల్యాబులలో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. గడిచిన 24 గంటల్లో 18,17,639 పరీక్షలు చేశారు. కరోనా టెస్టుల కోసం దేశవ్యాప్తంగా 1327 ప్రభుత్వ లాబ్స్,1593 ప్రైవేట్ లాబ్స్ అందుబాటులో ఉన్నాయి.