chandrababu: వైఎస్ వివేకా హత్య కేసుతో సంబంధం ఉన్నవారు వరుసగా చనిపోతున్నారు: చంద్ర‌బాబు

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసుతో పాటు ఏపీ సీఎం జగన్ అక్ర‌మ‌ ఆస్తుల కేసుల్లో కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ (సీబీఐ) తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ వివేకా హత్య కేసుతో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సంబంధం ఉన్న వారు ఒక్కొక్కరు చనిపోతున్నారని అన్నారు. శ్రీనివాసరెడ్డి, గంగిరెడ్డి, గంగాధరరెడ్డిల వరుస మరణాల సంగతేంటీ? అని ఆయ‌న నిల‌దీశారు.

chandrababu: వైఎస్ వివేకా హత్య కేసుతో సంబంధం ఉన్నవారు వరుసగా చనిపోతున్నారు: చంద్ర‌బాబు

Chandrababu naidu

chandrababu: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసుతో పాటు ఏపీ సీఎం జగన్ అక్ర‌మ‌ ఆస్తుల కేసుల్లో కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ (సీబీఐ) తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో శుక్ర‌వారం చంద్ర‌బాబు మీడియాతో మాట్లాడుతూ… వైఎస్ వివేకా హత్య కేసుతో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సంబంధం ఉన్న వారు ఒక్కొక్కరు చనిపోతున్నారని అన్నారు. శ్రీనివాసరెడ్డి, గంగిరెడ్డి, గంగాధరరెడ్డిల వరుస మరణాల సంగతేంటీ? అని ఆయ‌న నిల‌దీశారు.

Rajya Sabha Polls: మా పార్టీ నేత‌ల‌ను కొనేందుకు కాంగ్రెస్ బేర‌సారాలు: కుమార‌స్వామి

వైఎస్ వివేక హత్య కేసుతో సంబంధం ఉన్న వాళ్లని చంపేస్తారని తాము మొదటి నుంచి చెబుతూనే ఉన్నామ‌ని అన్నారు. వైఎస్ వివేక విషయంలో తాము చెప్పినట్టే జరుగుతోందని చంద్ర‌బాబు చెప్పారు. కరుడుగట్టిన నేరగాళ్లు పరిటాల రవి విషయంలోనూ ఇలాగే చేశారని ఆయ‌న అన్నారు. ఈ కేసులో ద‌ర్యాప్తును స‌మ‌ర్థంగా కొన‌సాగించ‌డం సీబీఐ విశ్వసనీయతకే పెను సవాల్ అని చంద్ర‌బాబు చెప్పారు.

Rajya Sabha Polls: రాజ్యసభ ఎన్నికల ఓటింగ్‌ ప్రారంభం

జ‌గ‌న్ కేసుల గురించి చంద్ర‌బాబు స్పందిస్తూ.. జగన్ అవినీతిపై సీబీఐ ఛార్జ్ షీట్ వేసినా ఈ కేసుల్లో చివ‌ర‌కు ఏమీ చేయలేకపోయిందని అన్నారు. సీబీఐ ఏం చేయలేకపోతోంటే ఈ రాష్ట్రాన్ని ఎవరు కాపాడతారని ఆయ‌న ప్ర‌శ్నించారు. నేరగాళ్లు రాజ్యం ఏలుతుంటే సీబీఐ వంటి సంస్థలు వారి బారి నుంచి ప్ర‌జ‌ల‌ను కాపాడకుంటే ఎలా అని ఆయ‌న నిల‌దీశారు. పల్నాడులో హత్యలు జరుగుతూనే ఉన్నాయని చంద్ర‌బాబు అన్నారు. గతంలో చంద్రయ్యను, ఇప్పుడు జల్లయ్య చంపేశారని ఆయ‌న చెప్పారు.

India-Bangladesh: ఇరు దేశాల మ‌ధ్య బ‌స్సు స‌ర్వీసులు మ‌ళ్లీ షురూ

బాధితుల‌ను టీడీపీ నేత‌లు క‌నీసం పరామర్శించడానికి కూడా అవకాశం లేకుండా చేస్తున్నారని ఆయ‌న మండిప‌డ్డారు. ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రమణ్యాన్ని చంపేస్తే, ఇంటికి మృత‌దేహాన్ని పంపి, అంత్యక్రియలు చేసుకోండని అంటారా? అని ఆయ‌న నిల‌దీశారు. ఇంత జరుగుతోంటే పోలీసులు ఏం చేస్తున్నారని చంద్ర‌బాబు అడిగారు. అనంతబాబు ఎపిసోడ్ నుంచి దృష్టి మళ్లించడానికే కోనసీమలో అల్లర్లను ప్రేరేపిస్తున్నారా అని ప్ర‌శనించారు. కోనసీమలో ఇష్టానుసారంగా తప్పుడు కేసులు పెట్ట‌డ‌మేంట‌ని అడిగారు.

India Corona: భారీగా పెరిగిన కొవిడ్ పాజిటివ్ కేసులు.. మహారాష్ట్రలో అత్యధికంగా నమోదు..

ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థులతో టీడీపీ నేత నారా లోకేశ్ జూమ్‌లో స‌మావేశం నిర్వ‌హించ‌గా అందులో మాజీ మంత్రి కొడాలి నాని, గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ క‌న‌ప‌డిన తీరుపై చంద్ర‌బాబు విమ‌ర్శ‌లు గుప్పించారు. పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేక‌పోయిన విద్యార్థుల‌కు భరోసా ఇస్తూ మీటింగ్ పెడితే దొంగల్లా దూరారని అన్నారు. దాన్ని ఏ2 సమర్థిస్తాడా? అని చంద్ర‌బాబు నిల‌దీశారు. వైసీపీ నేతలు బరితెగించారని ఆయ‌న అన్నారు. ఏ2 విజయసాయి రెడ్డికి ఎవ్వరూ భయపడరని, చర్చకు వస్తానంటే రమ్మనండి.. చూద్దామ‌ని చంద్ర‌బాబు స‌వాలు విసిరారు.

cordelia: విశాఖ నుంచి వెళ్లిన నౌక కార్డేలియాకు పుదుచ్చేరిలో అనుమ‌తి నిరాక‌ర‌ణ‌

నేరగాళ్ల‌కు నేరాలోచనలే వస్తాయని అన్నారు. పిల్లలను టెన్షన్ పడేలా చేశారని చెప్పారు. టీచర్లని మద్యం దుకాణాల వద్ద పెట్టినప్పుడే మానసికంగా టీచర్లు చనిపోయారని ఆయ‌న అన్నారు. టీచర్ల గౌరవాన్ని తగ్గించారని, వ్యవస్థలను నాశనం చేసి రౌడీయిజం చేయాలనుకుంటారా? అని వైసీపీని ఆయ‌న ప్ర‌శ్నించారు. వ్యవసాయాన్ని నాశనం చేశారు కాబట్టే క్రాప్ హాలిడే ప్రకటించారని చంద్ర‌బాబు విమ‌ర్శించారు. వైసీపీ పాల‌న‌లో ఆక్వా, హర్టీకల్చర్ రైతులు కూడా హాలిడే ప్రకటించనున్నారని ఆయ‌న చెప్పారు. జగన్ ఓ దరిద్రమ‌ని, రాష్ట్రానికి పట్టిన అరిష్టమ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. జగన్‌ది ఐరన్ లెగ్ అని, వ్యవస్థలను ధ్వంసం చేశారు కాబట్టే అరిష్టం పట్టిందని ఆయ‌న విమ‌ర్శించారు.