Pushpa: పుష్పరాజ్ కోసం ఈ ఇద్దరూ.. ఫ్యాన్స్‌కి ఫుల్ మీల్స్

తగ్గేదేలే అంటున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. తెలుగు సినీ పరిశ్రమకి అఖండ తెచ్చిన మాస్ మానియాను అంతకు మించి అనేలా కొనసాగిస్తానని కాన్ఫిడెంట్ గా వచ్చేస్తున్నాడు.

Pushpa: పుష్పరాజ్ కోసం ఈ ఇద్దరూ.. ఫ్యాన్స్‌కి ఫుల్ మీల్స్

Pushpa

Pushpa: తగ్గేదేలే అంటున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. తెలుగు సినీ పరిశ్రమకి అఖండ తెచ్చిన మాస్ మానియాను అంతకు మించి అనేలా కొనసాగిస్తానని కాన్ఫిడెంట్ గా వచ్చేస్తున్నాడు. తన కెరీర్ లోనే తొలిసారి పాన్ ఇండియన్ సినిమాతో రాబోతున్న పుష్ప కోసం స్టైలిష్ స్టార్ అనేది పక్కన పెట్టేసి కంప్లీట్ మాస్ క్యారెక్టర్ లో ఒదిగిన అల్లు అర్జున్ సరిగ్గా ఇంకో పదిరోజులకు డిసెంబర్ 17న థియేటర్ల మీద దండెత్తబోతున్నాడు. ఇప్పటికే ఆ దండయాత్ర ఎలా ఉండబోతుందో ట్రైలర్ లో చూపించేశాడు.

Tollywood Directors: రెడీ బాబూ రెడీ.. ఈ దర్శకుల సినిమాలు మొదలెప్పుడు?

అల్లు అర్జున్ హీరోగా, రష్మికా మందన్నా హీరోయిన్‌గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ సినిమా పుష్ప. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ పాన్‌ ఇండియన్ సినిమా డిసెంబర్ 17వ తేదిన భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ప్రమోషన్స్‌ని జోరుగా చేస్తున్న యూనిట్ డిసెంబర్ 12న ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించనున్నట్లుగా తెలుస్తుంది. దీంతో ఈ వేడుకకు అతిధులుగా ఎవరు రానున్నారన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తిగా మారింది.

Theater Release Films: ఊరించి ఉడికించి ఈ వారం థియేటర్‌లో వచ్చేస్తున్న సినిమాలు!

హైదరాబాద్‌లో భారీ స్థాయిలో జరగనున్న ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి పుష్ప మేకర్స్ రెబల్ స్టార్ ప్రభాస్‌ను ముఖ్య అతిథిగా, మెగాస్టార్ చిరంజీవిని ప్రత్యేక అతిధిగా ఆహ్వానించారని ప్రచారం జరుగుతుంది. ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. అలాంటి స్టార్ ఈవెంట్ కి వస్తే అల్లు అర్జున్‌ తొలి పాన్ ఇండియా సినిమా పుష్పకి కావాల్సినంత మైలేజీ వస్తుంది. పైగా ఇండస్ట్రీలో తామంతా ఒక్కటే అనే మెసేజ్ బలంగా వెళ్తుంది. ఇక మెగాస్టార్ అంటే బన్నీకి ఫ్యామిలీ మెంబెర్ కనుక మెగా అభిమానులలో ఫుల్ జోష్ వస్తుంది.

SSMB 28: క్రేజీ అప్డేట్.. మహేష్-త్రివిక్రమ్ సినిమాలో సంజయ్ పాత్ర ఇదే?

అందుకే మేకర్స్ ప్రభాస్, చిరంజీవిను ఆహ్వానించినట్లుగా కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఈ వేడుక గురించి, అతిధుల గురించి ఎలాంటి అధికారిక లేదు కానీ సినీ వర్గాల్లో మాత్రం బలంగా ప్రచారం జరుగుతుంది. ఒకవేళ ఇదే జరిగితే ఇటు ప్రభాస్ అభిమానులతో పాటు మెగా అభిమానులకు పండగే అవుతుంది.

Raai Laxmi: బాబోయ్.. ఏంటీ రచ్చ రత్తాలు!