CM KCR : త్వరలోనే దళితబంధు నిధులు విడుదల : సీఎం కేసీఆర్

హుజూరాబాద్ తోపాటు నాలుగు మండలాల పరిధిలో ముందుగా ప్రకటించిన విధంగానే దళితబంధును అమలు చేస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. దళితబంధు విషయంలోనూ అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని తెలిపారు.

CM KCR : త్వరలోనే దళితబంధు నిధులు విడుదల : సీఎం కేసీఆర్

Dalitbandhu

CM KCR review on Dalitbandhu : దళిత సమాజం తలెత్తుకుని జీవించాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. దళిత కుటుంబాలు ఆర్థికంగా ఎదగాలని పేర్కొన్నారు. దళిత కుటుంబాలను ఆర్థికంగా పరిపుష్టం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం కేసీఆర్ అన్నారు. శనివారం (డిసెంబర్ 18,2021)న హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో జిల్లా కలెక్టర్లు, మంత్రులు, ఉన్నతాధికారులతో దళితబంధుపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు.
త్వరలో దళితబంధు నిధులను విడుదల చేస్తామని చెప్పారు.

హుజూరాబాద్ నియోజకవర్గంతోపాటు ఇప్పటికే నాలుగు మండలాల పరిధిలో ముందుగా ప్రకటించిన విధంగానే దళితబంధును అమలు చేస్తామని కేసీఆర్ అన్నారు. దళితబంధు విషయంలో కూడా అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. వారికి అవగాహన కల్పించాలని తెలిపారు. దళితులు ఎప్పుడైతే ఆర్థికంగా బాగుపడుతారో అప్పుడే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

CM KCR : యాసంగిలో ఒక్క కిలో వడ్లు కూడా కొనడంలేదు : సీఎం కేసీఆర్

దీనికి సంబంధించి కలెక్టర్లు కూడా చొరవ తీసుకోవాలని పేర్కొన్నారు. అదే విధంగా దళిత సమాజానికి సంబంధించిన పెద్దలు గానీ, ఆ సమాజానికి సంబంధించిన నేతలు గానీ క్షేత్రస్థాయిలో వెళ్లి వారికి అవగాహన కల్పించాలన్నారు. దళితులు వ్యాపారం చేసుకునే విధంగా ప్రోత్సహించాలని తెలిపారు. వ్యాపార మార్గాలకు సంబంధించి కలెక్టర్లు, ఉన్నతాధికారులు ఆలోచన చేయాలని సూచించారు.

దళిత సమాజం బాగుపడే విధంగా ఎలాంటి చర్యలు తీసుకుంటారో ముందస్తు ప్రణాళికలు రచించాలని కలెక్టర్లకు సీఎం కేసీఆర్ దిశానిర్ధేశించారు. దళితుల ఆర్థిక ప్రగతి ద్వారానే వారి జీవన విధానంలో మార్పులు వస్తాయని సూచించారు. కచ్చితంగా దళితబంధు అమలు విషయంలో ఇటు హుజూరాబాద్ లో పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టి దళితబంధును అమలు చేస్తున్నామని చెప్పారు.

CM KCR : తెలంగాణలో కొత్త జోనల్ ప్రకారమే ఉద్యోగుల విభజన : సీఎం కేసీఆర్

మరో నాలుగు మండలాల్లో ప్రకటించిన విధంగానే అమలు చేస్తామని చెప్పారు. రానున్న మార్చి నెల వరకు దళితబంధు పథకాన్ని అన్ని నియోజకవర్గాల్లో అమలు చేస్తామని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో కచ్చితంగా వంద మందికి దళితబంధు సాయం అందేలా చూడాలని ఆదేశించారు. దళితబంధు విషయాన్ని సూచించాలని కలెక్టర్లకు సీఎం కేసీఆర్ సూచించారు.