Hyd Fire Accident: బోయిగూడ ప్రమాదంపై ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ విచారం.. పరిహారం ప్రకటన

సికింద్రాబాద్ బోయిగూడ ఘటనపై.. ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు.. 5 లక్షల రూపాయల చొప్పున పరిహారాన్ని సీఎం కేసీఆర్ ప్రటించారు.

Hyd Fire Accident: బోయిగూడ ప్రమాదంపై ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ విచారం.. పరిహారం ప్రకటన

Kcr On Fire Accident

Hyd Fire Accident: సికింద్రాబాద్ బోయిగూడ ఘటనపై.. ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 11 మంది సజీవ దహనం కావడంపై విచారం చెందారు. బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు.. 5 లక్షల రూపాయల చొప్పున పరిహారాన్ని సీఎం కేసీఆర్ ప్రటించారు.

ప్రమాదంలో చనిపోయిన వారి పార్థివ దేహాలను.. వారి స్వస్థలాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకోవాలని తెలిపారు. మరోవైపు.. ప్రధాని మోదీ సైతం కేంద్ర ప్రభుత్వం తరఫున.. మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు.

ఇక.. ఘటనా స్థలాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సందర్శించారు. బాధితులను ఆదుకుంటామన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా.. అధికారులు తగిన చర్యలు తీసుకుంటారని చెప్పారు. హైదరాబాద్ కలెక్టర్ శర్మన్ సైతం.. ఘటనా స్థలాన్ని సందర్శించారు. ప్రమాదంలో మృతులను గుర్తించామన్నారు. ఘటనపై దర్యాప్తు చేయిస్తున్నామని.. చట్టం ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Read More:

Fire Accident: బోయిగూడలో భారీ అగ్ని ప్రమాదం, 11 మంది సజీవ దహనం

Hyd Fire Accident: ప్రమాదం బాధాకరం.. మృతుల కుటుంబాలను ఆదుకుంటాం: మంత్రి తలసాని

Hyd Fire Accident: బోయిగూడ ప్రమాదంలో.. మృతుల వివరాలు..!