KCR – Uddhav: నేడు మహారాష్ట్ర సీఎంతో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ

ముంబై బయలుదేరిన సీఎం కేసీఆర్.. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ను కలిసి..పలు అంశాలపైనా చర్చించనున్నారు

KCR – Uddhav: నేడు మహారాష్ట్ర సీఎంతో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ

Kcr

KCR – Uddhav: జాతీయ రాజకీయాల్లో భాజపా వ్యతిరేక కూటమి ఏర్పాటే లక్ష్యంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ముమ్మర కసరత్తు చేస్తున్నారు. ఈమేరకు భాజపాయేతర పార్టీలు, ఇతర రాష్ట్రాల్లోని అధికార ప్రాంతీయ పార్టీల నేతలతో సీఎం కేసీఆర్ చర్చలు జరుపుతున్నారు. ఈక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో కేసీఆర్ భేటీ కానున్నారు. ఆదివారం ముంబై బయలుదేరిన సీఎం కేసీఆర్.. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ను కలిసి..పలు అంశాలపైనా చర్చించనున్నారు. భాజపాయేతర కూటమి ఏర్పాటుపై గతంలో ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఫోన్ ద్వారా పాక్షిక చర్చలు జరిపిన సీఎం కేసీఆర్ .. వారినెవరిని కలిసే ప్రయత్నం చేయలేదు. ఈవిషయంలో మొట్టమొదటిసారి మహారాష్ట్ర సీఎంతో చర్చలు జరిపేందుకు కేసీఆర్ స్వయంగా వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Also read: Punjab Polls: నేడే పంజాబ్ ఎన్నికలు.. ఉదయం 7 గంటలకే ప్రారంభం

మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఆహ్వానం మేరకే కేసీఆర్ వెళ్తున్నారు. ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రత్యేక విమానంలో సీఎం కేసీఆర్ ముంబై చేరుకుంటారు. ఆయన వెంట మంత్రి హరీష్ రావు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, టీఆర్ఎస్ పార్లమెంటరీ నేత కే.కేశవరావు కూడా ముంబై వెళ్లనున్నారు. ఈ సమావేశం సందర్భంగా భాజపాయేతర కూటమి ఏర్పాటు సహా, తెలంగాణ – మహారాష్ట్ర మధ్యనున్న పలు అపరిష్కృత ప్రాజెక్టుల గురించి సీఎంలు కేసీఆర్, ఉద్ధవ్ చర్చించనున్నట్లు సమాచారం.

Also read: Raja Singh : రాజాసింగ్ పై ఈసీ సీరియస్.. కేసు నమోదు చేయాలని ఆదేశం