Building Construction Demolition Banned : ఢిల్లీలో బాగా త‌గ్గిన గాలి నాణ్య‌త.. భవన నిర్మాణాలు, కూల్చివేతలు నిషేధం

ఢిల్లీలో తీవ్ర వాయు కాలుష్యం కారణంగా గాలి నాణ్యత బాగా తగ్గిపోయింది. ఈ మేరకు ఎయిర్ క్వాలిటీ కమిషనర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. భవన నిర్మాణాలు, కూల్చివేతలపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Building Construction Demolition Banned : ఢిల్లీలో బాగా త‌గ్గిన గాలి నాణ్య‌త.. భవన నిర్మాణాలు, కూల్చివేతలు నిషేధం

building construction ban

Building Construction Demolition Banned : ఢిల్లీలో తీవ్ర వాయు కాలుష్యం కారణంగా గాలి నాణ్యత బాగా తగ్గిపోయింది. ఈ మేరకు ఎయిర్ క్వాలిటీ కమిషనర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. భవన నిర్మాణాలు, కూల్చివేతలపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అత్యవసరం కాని నిర్మాణాలు, కూల్చివేతలను చేపట్టకూడదని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఢిల్లీలో గాలి నాణ్యత 400లకు పడిపోయింది. ఆదివారం సాయంత్రం 4 గంటలకు గాలి నాణ్యత 407గా ఉంది.

గాలి నాణ్యత 400 నుంచి 500 మధ్య ఉంటే ఊపరి తీసుకోవడం కష్టంగా ఉంటుంది. అందుచేత ముందు జాగ్రత్త చర్యగా ఎయిర్ క్వాలిటీ కమిషనర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. గాలి వేగం తగ్గిపోవడంతో పాటు వాతావరణంలో మిక్సింగ్ లేయర్ తగ్గిపోవడం కారణంగా ఢిల్లీలో గాలి నాణ్యత పడిపోతుందని వాతావరణ శాఖ శాస్త్రవేత్త విజయ్ సోని పేర్కొన్నారు.

Delhi Air Quality Worsened : ఢిల్లీలో తీవ్ర వాయు కాలుష్యం.. మరింత క్షీణించిన గాలి నాణ్యత

నెల రోజుల క్రితం గాలి నాణ్యత బాగా తగ్గిపోవడంతో ఢిల్లీలోకి భారీ వాహనాలు, డీజిల్ తో నడిచే వెహికిల్స్ ను అనుమతించలేదు. స్కూల్స్ కు కూడా కొన్ని రోజులు సెలవులు ప్రకటించారు. అయితే పరిస్థితి మెరుగపడటంతో నవంబర్ 14న నిషేధాన్ని ఎత్తివేశారు. దీంతో పాఠశాలలను పున:ప్రారంభించారు.