Compensation : ఆత్మహత్య చేసుకున్న కరోనా రోగుల కుటుంబాలకూ రూ.50 వేల పరిహారం

ఆత్మహత్య చేసుకున్న కరోనా రోగుల కుటుంబాలకూ కేంద్రం పరిహారం ఇవ్వనుంది. కరోనా పాజిటివ్‌ వచ్చిన 30రోజుల్లోపు ఆత్మహత్య చేసుకున్న రోగుల కుటుంబీకులు పరిహారం పొందడానికి అర్హులని తెలిపింది.

Compensation : ఆత్మహత్య చేసుకున్న కరోనా రోగుల కుటుంబాలకూ రూ.50 వేల పరిహారం

Corona Deaths (1)

Compensation to families of corona deaths : కరోనా మృతుల కుటుంబాలతోపాటు ఆత్మహత్య చేసుకున్న కరోనా రోగుల కుటుంబాలకు కూడా కేంద్ర ప్రభుత్వం నష్ట పరిహారం అందించనుంది. కరోనా వైరస్ పాజిటివ్‌ రిపోర్టు వచ్చిన 30 రోజుల్లోపు ఆత్మహత్య చేసుకున్న రోగుల కుటుంబ సభ్యులు నష్ట పరిహారం పొందడానికి అర్హులేనని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది.

కరోనా బారిన పడి ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకు నష్ట పరిహారం అందించే అంశంపై పునఃపరిశీలించాలన చేయాలని న్యాయమూర్తులు జస్టిస్‌ ఎం.ఆర్‌.షా, జస్టిస్‌ ఎ.ఎస్‌.బోపన్నలతో కూడిన ధర్మాసనం సూచించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం గురువారం సుప్రీంకోర్టుకు ప్రమాణపత్రం దాఖలు చేసింది.

Corona : ప్రపంచవ్యాప్తంగా కరోనా తగ్గుముఖం

కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ, ఐసీఎంఆర్‌ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం కరోనా వైరస్ పాజిటివ్‌ అని నిర్ధారణ అయిన 30 రోజుల్లోపు ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబ సభ్యులు ఎస్‌డీఆర్‌ఎఫ్‌ కింద నష్ట పరిహారం పొందడానికి అర్హులేనని ప్రమాణ పత్రంలో పేర్కొంది. ఈ మేరకు కోర్టు ఉత్తర్వులు జారీ చేయొచ్చని అదనపు ప్రమాణపత్రంలో తెలిపింది.

ఇప్పటికే ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నుంచి కరోనా మృతుల కుటుంబాలకు రూ.50వేల చొప్పున పరిహారం చెల్లించడానికి రాష్ట్రాలకు అనుమతిచ్చినట్లు కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఇప్పుడు ఇది ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకు కూడా వర్తించనుంది.