PayGautam: కర్ణాటక ఫార్ములాను కాపీ కొట్టిన కాంగ్రెస్.. బొమ్మై సరే, మోదీతో అయ్యే పనేనా?

ప్రజలు చెల్లించే టాక్సులు ప్రభుత్వానికి కాకుండా అదానీకి వెళ్తున్నాయనే అర్థంలో కాంగ్రెస్ ఇలా రూపొందించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ బలం, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ బలం వేరు వేరు. కర్ణాటకలో ముందు నుంచి బలమైన ప్రతిపక్షంగా ఉంది. పైగా మోదీ లాంటి బలమైన నాయకుడు కూడా బొమ్మై కాదు

PayGautam: కర్ణాటక ఫార్ములాను కాపీ కొట్టిన కాంగ్రెస్.. బొమ్మై సరే, మోదీతో అయ్యే పనేనా?

PayGautam campaign

PayGautam: కర్ణాటకలోని బసవరాజు బొమ్మై ప్రభుత్వం 40 శాతం కమిషన్లు తీసుకుంటుందనే ఆరోపణల నేపథ్యంలో ‘పేసీఎం’ అంటూ విపక్ష కాంగ్రెస్ పార్టీ చేపట్టిన పోస్టర్ కార్యక్రమం చాలా వరకు సక్సెస్ వరకు అయిందనే చెప్పవచ్చు. ఈ కార్యక్రమం వల్ల కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి మంచి మైలేజ్ వచ్చింది. పేటీఎంకు ఉండే స్కానర్ స్థానంలో సీఎం బొమ్మై ఫొటోను ముద్రించిన రూపొందించిన పోస్టర్ల వల్ల బీజేపీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం చాలా భంగపాటును ఎదుర్కొంది.

Odisha: పని చేయించుకుని డబ్బులు ఇవ్వలేదు.. కాలినడకన కర్ణాటక నుంచి ఒడిశాకు వలస కూలీలు

కాగా, కర్ణాటకను జాతీయ కాంగ్రెస్ ఆదర్శంగా తీసుకున్నట్టే కనిపిస్తోంది. కొద్ది రోజులుగా అదానీ గ్రూపుల్లో భారీ ఎత్తున అవినీతి జరిగిందంటూ తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. అలాగే అదానీకి మోదీ ప్రభుత్వం ఇష్టారీతిన దోచి పెట్టారని కాంగ్రెస్ పార్టీ సహా విపక్షాలు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇదే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ ఆయుధంగా మలుచుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టే కనిపిస్తోంది. పేటీఎం వంటి స్కానర్లో మోదీ ఫొటోను ముద్రించి ‘పే-గౌతమ్’ అని పోస్టర్లు రూపొందించింది.

McDonalds : ఉద్యోగాల కోత.. ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమైన మెక్‌డొనాల్డ్స్

ప్రజలు చెల్లించే టాక్సులు ప్రభుత్వానికి కాకుండా అదానీకి వెళ్తున్నాయనే అర్థంలో కాంగ్రెస్ ఇలా రూపొందించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ బలం, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ బలం వేరు వేరు. కర్ణాటకలో ముందు నుంచి బలమైన ప్రతిపక్షంగా ఉంది. పైగా మోదీ లాంటి బలమైన నాయకుడు కూడా బొమ్మై కాదు. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఆశించిన దానికంటే ఎక్కువ మైలేజే లభించింది. కానీ కేంద్రంలో పరిస్థితి అలా లేదు.

Dogs Attack : ఒడిశాలో స్కూటీని వెంబడించిన వీధి కుక్కలు.. ముగ్గురికి తీవ్ర గాయాలు

బీజేపీకి సొంతంగానే 300 స్థానాలు ఉండగా.. కాంగ్రెస్ కనీసం ఆ కనుచూపు మేరల్లో కూడా లేదు. అలాగే మోదీకి వ్యతిరేకంగా రాహుల్ కానీ, మరో నేత కానీ నిల్చుని నిలదొక్కుకునే పరిస్థితులు ఇప్పటికి అయితే కనిపించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కర్ణాటక లాంటి ప్రచారం ప్రారంభించిన జాతీయ కాంగ్రెస్.. ఈ ప్రచారంతో ఎంత వరకు ఆశిస్తున్నది సాధిస్తుందో చూడాలి.