Sonia Gandhi : కన్యాకుమారి నుంచి కాశ్మీర్‌కు..’భారత్ జోడో యాత్ర’ : సోనియా గాంధీ

2024 లోక్‌సభ ఎన్నికలపై దృష్టి సారించే సంస్కరణలు, నిర్మాణం, పార్టీ పదవులకు నియామకాలు, నియమాలు, కమ్యూనికేషన్‌లు, ప్రచారం, ఔట్‌రీచ్, ఆర్ధిక, ఎన్నికల నిర్వహణతో సహా అన్ని అంశాలను టాస్క్‌ఫోర్స్‌ పరిశీలిస్తుందన్నారు. రెండు, మూడు రోజుల్లో టాస్క్ ఫోర్స్ ప్రకటన ఉంటుందని తెలిపారు.

Sonia Gandhi : కన్యాకుమారి నుంచి కాశ్మీర్‌కు..’భారత్ జోడో యాత్ర’ : సోనియా గాంధీ

Sonia Gandhi (2)

Sonia Gandhi : చింతన్‌ శివిర్‌… ఉత్సాహ వాతారణంలో మంచి ఫలితాల సాధన దిశగా సాగిందని కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ పేర్కొన్నారు. నిర్మాణాత్మక, భాగస్వామ్య స్ఫూర్తితో సూచనలను అందించడానికి చింతన్‌ శివిర్‌ లో అవకాశం వచ్చిందని తెలిపారు. అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికలకు మేనిఫెస్టోలను సిద్ధం చేయడానికి ఆరు గ్రూపులలో జరిగిన చర్చల సారాంశం ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. ఉదయ్‌పూర్‌ చింతన్‌ శివిర్‌లో సోనియా గాంధీ ముగింపు ఉపన్యాసం చేశారు. సంస్థాగత మార్పులకు సంబంధించిన నివేదిక తక్షణమే అమల్లోకి రావాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఆ కమిటి ఇచ్చిన వివరణాత్మక సిఫార్సులపై త్వరితగతిన చర్యలు తీసుకుంటానని తెలిపారు. గాంధీ జయంతి నాడు కన్యాకుమారి నుంచి కాశ్మీర్‌కు..’భారత్ జోడో యాత్ర’ను ప్రారంభిస్తామని పేర్కొన్నారు.

ఒత్తిడిలో ఉన్న సామాజిక సామరస్య బంధాలను పటిష్టం చేసేందుకు, దాడికి గురవుతున్న రాజ్యాంగ పునాది విలువలను కాపాడేందుకు, కోట్లాది మంది ప్రజల రోజువారీ ఆందోళనలను ఎత్తిచూపేందుకు ఈ యాత్ర సాగుతుందని స్పష్టం చేశారు. జిల్లా స్థాయిలో…. జన్ జాగరణ్ అభియాన్ 2.0ను.. జూన్ 15 నుంచి ప్రారంభించాలని సూచించారు. ఆర్థిక సమస్యలను ముఖ్యంగా పెరుగుతున్న నిరుద్యోగం, జీవనోపాధిని నాశనం చేస్తున్న ధరల పెరుగుదలను ఎత్తిచూపడంపై ప్రచారం చేయాలన్నారు. ఉదయపూర్‌లో వివిధ కమిటీలు చర్చించి… సూచించిన అవసరమైన అంతర్గత సంస్కరణల ప్రక్రియను నడపడానికి ఒక సానుకూల టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు సోనియాగాంధీ ప్రకటించారు.

Rahul Gandhi : సబ్ కా సాథ్ ఒక్క కాంగ్రెస్‌తోనే సాధ్యం : రాహుల్ గాంధీ

2024 లోక్‌సభ ఎన్నికలపై దృష్టి సారించే సంస్కరణలు, నిర్మాణం, పార్టీ పదవులకు నియామకాలు, నియమాలు, కమ్యూనికేషన్‌లు, ప్రచారం, ఔట్‌రీచ్, ఆర్ధిక, ఎన్నికల నిర్వహణతో సహా అన్ని అంశాలను టాస్క్‌ఫోర్స్‌ పరిశీలిస్తుందన్నారు. రెండు, మూడు రోజుల్లో టాస్క్ ఫోర్స్ ప్రకటన ఉంటుందని తెలిపారు. రాజకీయ సమస్యలు, సవాళ్లపై చర్చించడానికి వర్కింగ్‌ కమిటి నుంచి ఒక సలహా మండలి ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సలహా మండలి… క్రమం తప్పకుండా సమావేశమయ్యి… రాజకీయ అంశాలపై తగిన సూచనలు, సలహాలు ఇస్తుందన్నారు. సీనియర్ నేతల అపారమైన అనుభవాన్ని పొందడంలో కూడా ఈ సలహామండలి సహాయకారిగా ఉంటుందని పేర్కొన్నారు.

మూడు రోజుల చర్చలు… సీనియర్లు, జూనియర్లు తేడా లేకుండా…. ప్రతి ఒక్కరితో మమేకమై అన్ని అంశాలపై కూలంకషంగా చర్చించడానికి ఉపయోగపడ్డాయని చెప్పారు. ఆరు కమిటీల చర్చల్లో హాజరై…తాను కూడా పలు సూచనలు చేశాను, పలువురు చేసిన ప్రతిపాదనలను తెలుసుకోగలిగానని తెలిపారు. మూడు రోజుల పాటు ఇంత మంది నేతలతో గడపడం తన కుటుంబంతో గడిపినట్లుగా ఉందన్నారు. ‘మేము అధిగమిస్తాము.. అది మా సంకల్పం…. అదే మన నవసంకల్పం.. కాంగ్రెస్‌కు కొత్త ఉషోదయం రానుంది…. అదే మన నవసంకల్పం’ అని పిలుపునిచ్చారు.

CWC : ఉదయ్‌పూర్‌ డిక్లరేషన్‌కు ఆమోదం.. అధికారంలోకి వస్తే ఈవీఎంల బదులు పేపర్‌ బ్యాలెట్!

జూన్‌ 15 నుంచి కాంగ్రెస్‌ పార్టీ జన జాగరణ యాత్ర రెండో విడత ప్రారంభమవుతుందని తెలిపారు. నిరుద్యోగం అంశం ప్రధాన అస్త్రంగా జనజాగరణ యాత్ర సాగనుందని చెప్పారు. దేశ వ్యాప్తంగా యాత్రలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. అక్టోబర్ 2 నుంచి భారత ఐక్యతా యాత్ర చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. యాత్రలో సీనియర్లు ఎక్కడ ఎలా పాల్గొనాలో జనజాగరణ కమిటి నిర్ణయిస్తుందని చెప్పారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను అధిగమిస్తాము… ముందుకు వెళతాము.. అదే నవసంకల్పం అని తెలిపారు.