AAP Raghav Chadha: కాంగ్రెస్ ఒక చచ్చిన గుర్రం, బీజేపీకి ప్రత్యామ్న్యాయం ఆప్: ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా

రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోతుందని..జాతీయ స్థాయిలో బీజేపీకి బలమైన ప్రత్యర్థిగా ఆమ్ ఆద్మీ పార్టీ నిలుస్తుందని, ప్రధాని మోదీకి..గట్టి పోటీ ఇవ్వగలమని జోష్యం చెప్పారు

AAP Raghav Chadha: కాంగ్రెస్ ఒక చచ్చిన గుర్రం, బీజేపీకి ప్రత్యామ్న్యాయం ఆప్: ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా

Aap

AAP Raghav Chadha: కాంగ్రెస్ పార్టీ ఒక చచ్చిన గుర్రం వంటిదని..చచ్చిన దాన్ని తిరిగి నిలబెట్టడం వల్ల ప్రయోజనం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా అన్నారు. వార్త సంస్థ ANI ప్రతినిధితో శనివారం ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ ఈవ్యాఖ్యలు చేశారు. కాగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ భేటీపై రాఘవ్ చద్దా స్పందిస్తూ..రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోతుందని..జాతీయ స్థాయిలో బీజేపీకి బలమైన ప్రత్యర్థిగా ఆమ్ ఆద్మీ పార్టీ నిలుస్తుందని, ప్రధాని మోదీకి..గట్టి పోటీ ఇవ్వగలమని జోష్యం చెప్పారు. “కాంగ్రెస్ పార్టీ ఒక చచ్చిన గుర్రం, ఆ పార్టీని తిరిగి నిలబెట్టడం ద్వారా ప్రయోజనం ఉండదు” అని రాఘవ్ చద్దా అన్నారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్‌లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ను ఓడించి అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ..ఆ విజయంతో ఉప్పొంగిపోతుంది.

Also Read:Delhi Covid Cases : ఢిల్లీలో కరోనా విజృంభణ.. నిఘా పెంచాం.. ఆందోళన చెందొద్దు : మనీష్ సిసోడియా

దీంతో త్వరలో జరగనున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆమ్ ఆద్మీ పోటీకి దిగనుంది. ఈక్రమంలో బీజేపీకి జాతీయ ప్రత్యామ్నాయంగా అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తుందని ఆప్ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో అధికారంలో ఉండగా..కాంగ్రెస్ పార్టీ రాజస్థాన్, చత్తీశ్గఢ్ రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. రెండు పార్టీలు రెండేసి రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాయి. గుజరాత్ ఎన్నికలు సహా 2024 ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ముమ్మర కసరత్తు చేపట్టింది. అందులో భాగంగానే..శనివారం ప్రశాంత్ కిషోర్ తో కాంగ్రెస్ అధిష్టానం భేటీ అయింది.

Also read:By Polls in States: బీజేపీకి వ్యతిరేక పవనాలు: పలు రాష్ట్రాల ఉపఎన్నికల్లో బీజేపీయేతర పార్టీల అభ్యర్థుల గెలుపు

మరో వైపు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటిపై దాడి చేసిన పలువురు యువకులను ఢిల్లీ బీజేపీ నేతలు సత్కరించారు. దీనిపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందిస్తూ..బీజేపీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికాలో విధ్వంసానికి పాల్పడితే వారు జైలుకు వెళ్తారు..కానీ భారత్ లో మాత్రం ఆపార్టీలోకి వెళ్తున్నారు. అంటూ బీజేపీ నేతలనుద్దేశించి కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.