Karnataka Polls: బాగా డేర్ చేసిన కాంగ్రెస్.. అధికారంలోకి రాగానే ఇస్లామిక్ సంస్థతో పాటు హిందూ సంస్థనూ రద్దు చేస్తారట

కర్ణాటకలో కూడా రద్దు చేయాలనే డిమాండ్లు ఉన్నప్పటికీ బొమ్మై ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకోలేదు. అయితే తాము అధికారంలోకి వస్తే పీఎఫ్ఐతో పాటు బజరంగ్ దళ్‌‭ను రద్దు చేస్తామంటూ కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. ఇన్నేళ్లకు హిందూ సంస్థను రద్దు చేస్తామని ఏకంగా మేనిఫెస్టోలోనే పెట్టడంపై పెద్ద ఎత్తున రాజకీయ చర్చ జరుగుతోంది.

Karnataka Polls: బాగా డేర్ చేసిన కాంగ్రెస్.. అధికారంలోకి రాగానే ఇస్లామిక్ సంస్థతో పాటు హిందూ సంస్థనూ రద్దు చేస్తారట

Karnataka Polls: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసింది. అయితే ఈ మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ చేసిన ఒక వాగ్దానం రాజకీయంగా తీవ్ర వివాదాస్పమైంది. ఇస్లామిక్ సంస్థ అయిన పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)తో పాటు హిందూ సంస్థ అయిన బజరంగ్ దళ్‌ను రద్దు చేస్తామని చెప్పారు. ఆర్ఎస్ఎస్ సహా కొన్ని హిందూ సంస్థలపై నిషేధం అనేది చాలా సందర్భాల్లో వినిపించినప్పటికీ అది ఒక పార్టీ వాగ్దానం కిందకు మాత్రం ఎప్పుడూ రాలేదు. కానీ మొదటిసారి ఒక హిందూ సంస్థను రద్దు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం గమనార్హం.

Sharad Pawar: ఎన్‌సీపీ అధ్యక్ష పదవికి శరద్ పవార్ రాజీనామా..! అజిత్ పవార్ నిర్ణయమే కారణమా?

గతంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)ను కాంగ్రెస్ పార్టీయే రద్దు చేసింది. అనంతరం కొద్ది రోజులకు నిషేధం ఎత్తివేశారు. ఇక అప్పటి నుంచి హిందూ సంస్థలు రద్దైన దాఖలాలు లేవు. అప్పుడు రాజకీయ నేతల నుంచి రద్దుకు సంబంధించిన వ్యాఖ్యలు వచ్చినప్పటికీ పార్టీ నిర్ణయాలుగానో వాగ్దానాలుగానో ఎప్పుడూ మారలేదు. మళ్లీ ఇన్నేళ్లకు హిందూ సంస్థను రద్దు చేస్తామని ఏకంగా మేనిఫెస్టోలోనే పెట్టడంపై పెద్ద ఎత్తున రాజకీయ చర్చ జరుగుతోంది.

Bihar CM Nitish Kumar : సీఎం సార్..నేను చనిపోలేదు, ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నా : నితీశ్ కుమార్‌కు లేఖ

బజరంగ్ దళ్‌ అనేది విశ్వహిందూ పరిషత్ యువజన విభాగం. దేశంలో ఆర్ఎస్ఎస్ తర్వాత అత్యంత ఆదరణ ఉన్న హిందూ సంస్థ విశ్వహిందూ పరిషత్. దేశ వ్యాప్తంగా పీఎఫ్ఐ రద్దు కొనసాగుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో రద్దు చేశారు. అయితే కర్ణాటకలో కూడా రద్దు చేయాలనే డిమాండ్లు ఉన్నప్పటికీ బొమ్మై ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకోలేదు. అయితే తాము అధికారంలోకి వస్తే పీఎఫ్ఐతో పాటు బజరంగ్ దళ్‌‭ను రద్దు చేస్తామంటూ కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది.

Ukraine Apologized: జరిగిందానికి ఎంతో చింతిస్తున్నాం.. భారత్‌కు క్షమాపణలు చెప్పిన యుక్రెయిన్

ఇరు వర్గాల మధ్య విధ్వేషాలు సృష్టించడంలో పీఎఫ్ఐ వ్యవహరించిన తీరుగానే బజరంగ్ దళ్‌ సైతం వ్యవహరిస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. “కులం లేదా మతం ఆధారంగా భిన్న వర్గాల మధ్య ద్వేషాన్ని వ్యాప్తి చేసే వ్యక్తులు, సంస్థలపై దృఢమైన, నిర్ణయాత్మక చర్య తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. చట్టం, రాజ్యాంగం పవిత్రమైనవని. భజరంగ్ దళ్, పీఎఫ్ఐ సహా అలాంటి వ్యక్తులు, సంస్థలు ఎంతమాత్రం అలా వదిలేయలేము. మెజారిటీ లేదా మైనారిటీ వర్గాల మధ్య శత్రుత్వం లేదా ద్వేషాన్ని ప్రోత్సహించే ఏ సంస్థనైనా రద్దు చేస్తాం’’ అని మేనిఫెస్టో విడుదల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేతలు పేర్కొన్నారు.